ఐపిఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో.. టైటిల్ ను ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఫైనల్ లో ఆర్సీబీతో పోటీ పడే జట్టు ఏది అనేది రేపు తేలిపోనుంది. గుజరాత్ ముంబై జట్ల మధ్య జరిగిన ఎలిమినెటర్ మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. ముందు బాగానే ఆడినా ఆ తర్వాత తడబడింది. ఓపెనర్ సాయి సుదర్శన్.. అద్బుతమైన ప్రదర్శన చేసినా.. కీలక దశలో వికెట్ లు కోల్పోవడం మైనస్ అయింది.
Also Read : మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన కోహ్లీ..?
కుశాల్ మెండిస్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఇలా కీలక సమయాల్లో అవుట్ అయ్యారు. ఇదిలా ఉంచితే.. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియా జనాలు పెదవి విరుస్తున్నారు. సాధారణంగా ముంబై ఆడే ప్రతీ మ్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఉంటుంది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మ్యాచ్ పై కూడా అలాగే ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా కుశాల్ మెండిస్ అవుట్, అతను రెండు క్యాచ్ లు వదిలేయడం, ముంబై చివరి ఓవర్లో భారీగా పరుగులు సాధించడం వంటివి అనుమానాలకు దారి తీసాయి.
Also Read : పని మనిషిలా కాదు ఇంటి ఆడబిడ్డలా సాగనంపారు
ఇక ముంబై స్టాఫ్ తో అంపైర్ లు చర్చించడం వంటివి కూడా అనుమానాలు కలిగించాయి. దీనిపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. కప్ కొనుక్కున్నప్పుడు మ్యాచ్ లు నిర్వహించడం ఎందుకు, అభిమానులను పిచ్చోళ్ళను చేయడం ఎందుకు అని మండిపడుతున్నారు. అసలు మ్యాచ్ జరుగుతున్నప్పుడు నీతా అంబాని, ఆకాష్ అంబాని మైదానానికి సమీపంలో కూర్చోవడం ఎంత వరకు సబబు అంటూ విమర్శలు చేస్తున్నారు.