తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలని ఎన్డీఏ పట్టుదలగా ఉంది. అన్నా డీఎంకే నాయకులు ఇప్పటినుంచే ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం జయలలిత సెంటిమెంటును రగిలించేందుకు అన్నా డిఎంకె కష్టపడుతోంది. ఇదే సమయంలో అధికార డిఎంకె అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటుంది.
Also Read : లిక్కర్ స్కామ్‌లో ఎంటర్ అయిన సెంటర్.. కేసిరెడ్డితో మ్యూజిక్ స్టార్ట్
జాతీయస్థాయిలో తమను టార్గెట్ చేయడంతో లోకల్ సెంటిమెంటును రగిలించి.. అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ కష్టపడుతున్నారు. ఇందుకోసం సినిమా నటులను కూడా వాడుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టిన సినీ నటుడు కమలహాసన్ తో డిఎంకె ఒప్పందం చేసుకుంది. కమలహాసన్ సారధ్యంలోని ఎం. ఎన్. ఎం తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. పొత్తును ఇప్పటినుంచే ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
Also Read : అధినేతపై సన్నగిల్లుతున్న నమ్మకం..!
కమల్ హాసన్ కు అభిమానులు పెద్ద ఎత్తున ఉండటంతో అదీ తమ పార్టీకి కలిసి వస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు. కమల్ హాసన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపించాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. స్టాలిన్ ను రాజ్యసభకు పంపించి.. రెండు పార్టీలకు ఆయన స్టార్ క్యాంపెనర్ గా వాడుకోవాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా 15 సీట్లు ఆ పార్టీకి ఇచ్చేందుకు స్టాలిన్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే కమలహాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.