Friday, September 12, 2025 05:26 PM
Friday, September 12, 2025 05:26 PM
roots

అధికారులపై చంద్రబాబు సీరియస్..!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో దూకుడు పెంచారు. ఈ మధ్య మంత్రుల పని తీరు విషయంలో చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నారు. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయడం లేదనే ఆగ్రహం చంద్రబాబులో కనపడుతోంది. ఇటీవల మంత్రులకు సిఎం స్వయంగా ర్యాంక్ లు కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి చంద్రబాబు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈసారి అధికారులను కూడా హెచ్చరించారు సిఎం. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని చంద్రబాబు స్పష్టం చేసారు.

Also Read : వైసీపీ ఎంపిలకు జగన్ సంచలన ఆదేశాలు..?

స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వివిధ శాఖ‌ల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్సు జ‌రుగుతున్న క్ర‌మం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వగా.. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాల‌ని ఆదేశించారు. ఫైళ్లు ఎక్క‌డ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నే దానిపైన కార్య‌ద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకుని, ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం చేయాల‌ని స్పష్టం చేసారు.

Also Read : రోజాకు బై బై చెప్పిన జగన్..!

ఫైళ్ల‌లో ఆర్థిక‌, ఆర్థికేత‌ర అనే రెండు ర‌కాల ఫైళ్లుంటాయ‌ని, ఆర్థికేత‌ర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి ప‌రిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పారు. ఆర్థిక ప‌ర‌మైన ఫైళ్లు అయితే ఆయా శాఖ‌ల్లోని బ‌డ్జెట్ త‌దిత‌ర అంశాల‌ను సమీక్షించుకుని ఫైళ్లను త్వ‌రిత‌గ‌తిన స‌మీక్షించాలన్న ఆయన.. కొన్ని శాఖ‌ల్లో కొంత‌మంది అధికారులు త‌మ వ‌ద్ద ఫైళ్ల‌ను ఆరు నెల‌లు, సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంచుకుంటున్నార‌ని ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు సిఎం. కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స‌గ‌టు మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియ‌రెన్సు అవుతున్నాయ‌ని ఆర్టీజీఎస్ సీఈఓ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళారు. మరికొన్ని శాఖ‌ల్లో ఫైళ్లు ఆల‌స్య అవుతున్నాయ‌ని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్