Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

పేదల ఆకలి తీర్చేందుకు సిద్దమైన అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలపై సర్కార్ మరింత స్పీడ్ పెంచింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటిన్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది చంద్రబాబు ప్రభుత్వం. అందులో భాగంగా నేడు వందకు పైగా అన్న క్యాంటిన్ లను సర్కార్ ప్రారంభించడం విశేషం. ఈరోజు మధ్యాహ్నం గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 100 అన్న క్యాంటీన్లను ఎంపిక చేశారు. రేపటికి రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తుంది సర్కార్. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల కార్యక్రమానికి ఆమె రూ. 1 కోటి విరాళం ఇచ్చారు.

గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 180 అన్న క్యాంటిన్స్ ను నిర్వహించారు. వీటికి అప్పుడు విశేష ఆదరణ వచ్చింది. కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారడంతో జగన్ వాటిని పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. పైగా అన్న క్యాంటిన్లను గ్రామ సచివాలయాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటికి వైసీపీ రంగులు వేసుకోవడం పట్ల అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో… తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.

ఆ మాట ప్రకారం 4 కోట్ల 60 లక్షల భోజనాలు రూ.5 కే అందిస్తారు. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి రుచికరమైన భోజనం అందిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. అన్న క్యాంటిన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్రకు ఇచ్చింది సర్కార్. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించాలనేది ప్రణాళికగా కనపడుతోంది. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద క్యాంటిన్ల ఏర్పాటు చేయనున్నారు. అక్షయపాత్ర వారి వంటశాల చాలా ఆధునికంగా, అత్యంత పరిశుభ్రంగా ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్