Thursday, May 7, 2026 09:12 AM
Thursday, May 7, 2026 09:12 AM

పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరం చదువుతున్న పదవ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ రావడంతో.. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లుగా కీలక నిందితులు

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించారు. 2025-26 అకడమిక్ ఇయర్‌కు మాత్రం ఏపీ విద్యా శాఖ 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు, సీబీఎస్‌ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరగనున్నాయి. ఏపీ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు ఒక రోజు సెలవిచ్చారు. మ్యాథ్స్, బయాలజీ పరీక్షకు మాత్రం 3 రోజులు సెలవొచ్చింది. విద్యార్థులు మరింత ప్రిపేర్ అయ్యేలా ఇలా షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నవంబర్ 25 చివరి తేదీ. 50 రూపాయల ఫైన్‌తో డిసెంబర్ 3 వరకు, 500 రూపాయలు జరిమానాతో డిసెంబర్ 15 వరకు కట్టించుకుంటారు.

Also Read : టీడీపీ – వైసీపీ మధ్య విమానాల గోల..!

2026, మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, 20వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. 21, 22 తేదీలు సెలవు. 23న మ్యాథమ్యాటిక్స్, 25న ఫిజకల్ సైన్స్, 28 బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (కాంపోసైట్ కోర్స్), ఏప్రిల్ 1న ఎస్ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్ష ఉంటుంది. అన్న పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల మధ్య జరుగుతాయని.. పరీక్ష సమయానికి అరగంట ముందు కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన పేపర్ కోడ్ కూడా విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్