Saturday, October 25, 2025 09:58 PM
Saturday, October 25, 2025 09:58 PM
roots

చిరంజీవితో మరోసారి శర్వానంద్ ఢీ..!

తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలు కాస్తా.. పాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్నాయి. తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. హీరో మార్కెట్ బట్టి బిజినెస్ జరుగుతుంది కూడా. ఓటీటీ, డిజిటల్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లోనే తీస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వాడకంలో తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది.

Also Read : ఓజీ కోసం.. చీఫ్ గెస్ట్ లు వీళ్ళే..!

తెలుగు సినిమాకు రెండు అతి పెద్ద పండుగలు ప్రధాన మార్కెట్. అందులో ఒకటి దసరా.. మరొకటి సంక్రాంతి పండుగ. ఈ ఏడాది దసరా పండుగకు పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ విడుదలవుతోంది. అంతకు మందు తేజా సజ్జ, మంచు మనోజ్ కాంబినేషన్‌లో వస్తున్న మిరాయి వస్తుంది. ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ రోజున కాంతార 2 విడుదలకు సిద్ధమైంది.

ఇక సంక్రాంతి పండుగకు కూడా ఈసారి బడా సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు..” మరొకటి ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న “ది రాజా సాబ్”. ఈ రెండు సినిమాలకు కొత్తగా మరోకటి కూడా సంక్రాంతి రేసులో పోటి పడుతుంది. అదే శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాకు అనిల్ సుంకర దర్శకులు. ఈ సినిమా కూడా ఇప్పుడు సంక్రాంతి రేస్‌లో చేరింది. దీంతో 3 పెద్ద సినిమాలు పోటీ పడుతున్నట్లు అయ్యింది.

Also Read : దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

వాస్తవానికి 2017లో కూడా చిరంజీవితో శర్వానంద్ పోటీ పడ్డారు. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు 2017 సంక్రాంతికి విడుదలయ్యా. అదే సమయంలో శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి కూడా రిలీజ్ అయ్యింది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు తట్టుకుని శతమానం భవతి ఫుల్ పాజిటివ్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా మన శంకర వర ప్రసాద్ గారు, ది రాజా సాబ్ సినిమాలకు నారీ నారీ నడుమ మురారీ రిలీజ్ అవుతోంది. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా సూపర్ హిటో అవుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్