నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు. ఇక నేర పరిశోధనలో కూడా సాంకేతికతో పాటు ఫోటో, వీడియోలదే కీలక పాత్ర. చట్టపరమైన ప్రక్రియలో వీడియో, ఫోటో ఆధారాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫోటో.. ఒక జీవితాన్నే మార్చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఓ వ్యక్తి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. చివరికి అదే ఫోటో ఉద్యోగం కూడా చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అది కూడా కేవలం 24 గంటల్లోనే. ఇలా రాష్ట్రం బార్డర్ దాటే లోపు.. అంతా జరిగిపోయింది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… వైసీపీ వీరాభిమాని ఇప్పాల రవీంద్రారెడ్డి గురించే.
Also Read : వణికిస్తున్న లావు.. వైసీపీలో అలజడి
ఇప్పాల రవీంద్రారెడ్డి అనే పేరు ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లకు బాగా పరిచయం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఇంకా చెప్పాలంటే డై హార్డ్ ఫ్యాన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పైన ఈగ కూడా వాలనివ్వలేదు. నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు ఇప్పాల. ఒక్కమాటలో చెప్పాలంటే అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయాడు. టార్గెట్ టీడీపీ అన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై విమర్శలు చేశాడు. వ్యక్తిత్వ హననం చేశాడు. కుటుంబ సభ్యులపై రాయలేని భాషలో నీచమైన కామెంట్లు చేశాడు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యాడు ఇప్పాల రవీంద్రారెడ్డి. అయితే సడన్‌గా మంత్రి నారరా లోకేష్‌తో ఇప్పాల కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ప్రముఖ సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇప్పాల కూడా పాల్గొన్నాడు. లోకేష్‌తో నవ్వుతూ మాట్లాడాడు కూడా. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాడిని ఎలా అనుమతించాడంటూ లోకేష్ టీమ్‌పై విమర్శలు చేశారు. దీనిపై లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మరోసారి ఇప్పాలను సంస్థ పనుల్లో వేలు పెట్టనీయ్యద్దు అంటూ సిస్కో సంస్థకు లేఖ కూడా రాశారు.
Also Read : బెట్టింగ్ యాప్స్.. రేవంత్ సంచలన నిర్ణయం
అయితే ఈ వ్యవహారంపై సిస్కో సంస్థ వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం లోకేష్‌ను కలిసినట్లుగానే సిస్కో టీమ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యింది. కొన్ని శిక్షణ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల వరకు సిస్కోకు అకౌంట్ మేనేజర్‌గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా సైకోగా గుర్తింపు పొందిన ఇప్పాల రవీంద్రారెడ్డి ఈ ఒప్పందాలు చేసుకునే సమయంలో కనిపించలేదు. సోషల్ మీడియాలో ఇప్పాల నిజస్వరూపం చూసిన సిస్కో ఉన్నత బృందం కూడా సిగ్గుపడి అతనిని పక్కన పెట్టేసినట్లుగా ఉందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఇప్పాల రవీంద్రారెడ్డి… కేవలం తన నోటి దూల కారణంగానే పరువు మొత్తం పొగొట్టుకున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో ఇలా సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటే.. ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి.