కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. దాదాపు నెల రోజులకు క్రితమే ఈ విషయం బయటకు వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. చిరంజీవి 2009లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ తరఫునుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చిరంజీవి రాజ్యసభ తో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read : జగన్ సార్.. మేడం గారు బాగా..!
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయే వరకు ఆయన కేంద్ర మంత్రి గానే ఉన్నారు. ఆరేళ్లపాటు రాజ్యసభ ఎంపీగా సేవలందించిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం 32వేల రూపాయల పెన్షన్ ఇస్తోంది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 వేల రూపాయల పెన్షన్ ఇస్తూ వస్తోంది. ఇలా రెండు పెన్షన్లను చిరంజీవి తీసుకుంటున్నారని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గణేష్ అనే ఓ ఆర్ టి ఐ కార్యకర్త.. బయటపెట్టారు.
Also Read : వరకట్న నిషేధ చట్టం అంటే ఏంటీ..? శిక్షలు ఏంటీ..?
ఈ విషయంలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్దగా హడావుడి జరగకపోయినా.. ఇప్పుడు మాత్రం ఘాటుగానే విమర్శలు వస్తున్నాయి. సినిమాలు చేస్తూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న చిరంజీవి 62000 పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు పెన్షన్లను చిరంజీవి తీసుకోవడాన్నీ తప్పుపడుతున్నారు. సినిమాల్లో సమాజానికి ఆదర్శంగా ఉండే డైలాగులు వేసే హీరోలు నిజ జీవితంలో ఈ తరహా చర్యలకు దిగటం కరెక్ట్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. చిరంజీవిని ఏమైనా అంటే విరుచుకుపడే ఆయన అభిమానులు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నారు.