Tuesday, October 21, 2025 02:24 AM
Tuesday, October 21, 2025 02:24 AM
roots

ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇద్దరు హీరోలు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. తర్వాత కృష్ణ, కృష్ణంరాజు.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ.. కొద్ది రోజులకు నాగార్జున, వెంకటేష్.. ఇలా హీరోల జోడీ కొనసాగుతూనే ఉంది. హీరోలు బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం మా హీరోనే గొప్ప అని చెప్పుకుంటూ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

తొలి నుంచి చిరంజీవి, బాలకృష్ణ మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే ఉందనేది బహిరంగ రహస్యం. ఒక దశలో బహిరంగ వేదికల పైనే ఒకరిపై ఒకరి మాటల యుద్ధం నడిచింది కూడా. అయితే ఈ వివాదానికి బాలకృష్ణ నోటి దురుసు కూడా కొంత కారణం అంటారు టాలీవుడ్ పెద్దలు. వాస్తవానికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. అనేది బాలకృష్ణ నైజం. ఇది ఎదుటి వారికి కాస్త ఇబ్బంది కలిగించినా కూడా ఐ డోంట్ కేర్ అంటారు బాలకృష్ణ. ఇలా ముక్కు సూటిగా మాట్లాడుతారు కాబట్టే.. బాలయ్య అంటే చాలా మందికి భయం కూడా. అయితే కొంతకాలంగా ఈ ఇద్దరు హీరోలు కలిసే ఉన్నారు. చాలా విషయాల్లో కలిసే ఉన్నారు. పవన్ కల్యాణ్‌ను తమ్ముడు అని కూడా బాలకృష్ణ అంటున్నారు.

Also Read : లోకేష్ సాయం.. పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు..!

అయితే అసెంబ్లీలో జరిగిన ఓ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌సినీ పరిశ్రమ పెద్దలతో వ్యవహరించిన తీరుపై జరిగిన చర్చలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చారని కామినేని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణ సభలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. “కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ” ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట” అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై చిరంజీవి వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు వచ్చిందని.. అందుకే ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నా.. అంటూ లేఖ విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చారని.. నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి ప్రభుత్వం మాట్లాడితే బాగుంటుందన్నారు. అందుకు చొరవ తీసుకోవాలని కోరారన్నారు.

Also Read : పవన్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన సుజిత్..?

” అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి “ముఖ్యమంత్రి ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ ని వెళ్లి బాలకృష్ణని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తితో సహా మరి కొంతమంది వెళ్లి ముఖ్యమంత్రిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను.” అంటూ లేఖ విడుదల చేశారు.

Also Read : ప్రతిపక్ష హోదాపై చర్చ.. ఇదేం నాయకత్వం..!

చిరంజీవి ప్రకటనపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్‌కు నమస్కారం పెట్టి వేడుకుంటున్నా అని చిరంజీవి చెప్పినప్పుడు జగన్ ఎలా స్పందించారో అందరికీ తెలుసన్నారు. కోవిడ్ తర్వాత విడుదలైన అఖండ సినిమా టికెట్ల ధరలు రూపాయి కూడా పెంచలేదని.. అయినా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్. అసలు బాలకృష్ణ గత ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల వ్యవహరించిన తీరుపై కామెంట్ చేస్తే.. చిరంజీవి ఎందుకు స్పందించారని కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు హీరోల మధ్య, అభిమానుల మధ్య మళ్లీ యుద్ధం మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్