చింతకాయల అయ్యన్న పాత్రుడు… తెలుగు రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 1996-1998 మధ్య కాలంలో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించడంలో అయ్యన్న ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒంటికాలితో దూకుడు ప్రదర్శించారు. దీంతో జగన్ కూడా టార్గెట్ అయ్యన అన్నట్లుగా వ్యవహరించారు. కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.
Also Read : ఇచ్చి పుచ్చుకుంటున్న బాలయ్య.. రామ్ చరణ్
తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచినట్లు రికార్డు లేదు. తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మినహా.. మిగిలిన వారంతా ఓడిన వారే. ఇప్పుడు ఇదే భయం అయ్యన్న పాత్రుడిని కూడా వెంటాడుతోందని అనిపిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే… సైలెంట్‌గా తప్పుకుని… తన ప్లేస్‌లో వారసునికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయ్యన్నపాత్రుడు చింతకాయల విజయ్ టీడీపీలో కీలక స్థానంలో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు విజయ్ ఆసక్తి చూపించినప్పటికీ… చంద్రబాబు మాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్టీ సోషల్ మీడియా కోసం విజయ్ ప్రస్తుతం పని చేస్తున్నారు. ఇక రెండో కుమారుడు రాజేష్ ప్రస్తుతం నర్సీపట్నం మునిసిపల్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో రాజేష్‌ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు అయ్యన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎమ్మెల్యే గారి నోటి దూల.. కోపం గా టిడిపి క్యాడర్
గత ఎన్నికల్లో నర్సీపట్నం మునిసిపాలిటీ వైసీపీ గెలుచుకుంది. 28 వార్డుల్లో టీడీపీ 13 గెలవగా.. వైసీపీ 15 గెలుచుకుంది. ఎక్స్ అఫీషియో ఓటుతో ఛైర్మన్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. అయితే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఇద్దరు నేతలకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సగం సగం ఇవ్వాలనే ఇప్పట్లో వైసీపీ నేతలు సూచించారు. తొలి రెండున్నరేళ్ల తర్వాత పదవుల కోసం వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. దీంతో మాజీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. వైసీపీ ఓడిన తర్వాత వారిద్దరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. వాళ్లు చేరితే టీడీపీ బలం 15కు పెరుగుతుంది. వైసీపీ బలం 13కు పడిపోతుంది. రిజర్వుడు స్థానం కావడంతో ఎస్టీ మహిళను ఛైర్మన్ స్థానంలో కూర్చోబెడితే… వైస్ ఛైర్మన్‌గా చింతకాయల రాజేష్‌ను నియమించాలనే అయ్యన ప్లాన్. వైస్ ఛైర్మన్‌గా ఉన్న అనుభవంతో.. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవాలి అయ్యన్న పాత్రుడు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.