Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

బ్రహ్మపుత్ర నదికి చైనా బ్రేక్ వేస్తే..?

సింధు జలాల కోసం పాకిస్తాన్ ఏ స్థాయికైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఉగ్రమూక దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న భారత సర్కార్.. పాకిస్తాన్‌తో ఉన్న దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీని ప్రభావం పాకిస్తాన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది.

Also Read : బాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కనబెట్టింది. దీంతో పాకిస్తాన్‌కు నీటి కరవు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తీసుకువచ్చింది. చైనా కూడా బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అప్పుడు ఏం జరుగుతుందని భారత్‌ను పాకిస్తాన్ ప్రశ్నిస్తోంది. ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది.

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయటం వల్ల తమపై ప్రభావం పడుతుందని, కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపేస్తే భారత్‌పై కూడా ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్నా భారత్‌కు వచ్చిన నష్టం ఏం లేదని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై పూర్తి లెక్కలతోనే అసోం సీఎం బిశ్వశర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇందులో భారత్‌పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం ఎంతో స్పష్టంగా వివరించారు బిశ్వశర్మ.

Also Read : ఎవరు గెలిచినా చరిత్రే.. ఆసక్తిగా ఐపిఎల్ ఫైనల్

భారతదేశానికి చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే.. ఎలాంటి నష్టం లేదన్నారు అసోం సీఎం బిశ్వశర్మ. బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకి పోదన్నారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమే అని వెల్లడించారు. అదీ ఎక్కువగా హిమనీ నదాలు కరగడం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు. మిగిలిన 65 నుంచి 70 శాతం నీరు భారత్‌లోనే ఉంటుందన్నారు.

అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మేఘాలయలో కుండపోత రుతుపవనాల వర్షపాతం, సుబంసిరి, లోహిత్, కమెంగ్, మానస్, ధనసిరి, జియా-భరాలి, కోపిలి వంటి ప్రధాన ఉపనదులతో పాటు.. ఖాసీ, గారో, జైంతియా కొండల నుండి కృష్ణా, దిగారు, కుల్సి వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతాయన్నారు. ఇండో-చైనా సరిహద్దు ట్యూటింగ్ వద్ద ప్రవాహం 2 వేల నుంచి 3 వేల క్యూబిక్ మీటర్లు, అసోం మైదానాలలో గౌహతి వద్ద వర్షాకాలంలో ప్రవాహం 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల వరకూ పెరుగుతుందన్నారు.

Also Read : ఎవరు గెలిచినా చరిత్రే.. ఆసక్తిగా ఐపిఎల్ ఫైనల్

కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్‌లో ప్రవాహాలపైనే ఆధారపడి ఉందన్నారు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాతే బలపడుతుందని గుర్తుచేశారు. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినా కూడా భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించదనే విషయాన్ని పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజమన్నారు బిశ్వశర్మ. వాస్తవానికి బ్రహ్మపుత్ర నీటి విషయంలో చైనా ఎప్పుడూ బెదిరించలేదు, ఏ అధికారిక వేదికపైన సూచించలేదు. బ్రహ్మపుత్ర నీటిని చైనా నిలిపేస్తే..అది అసోంలో వార్షిక వరదలను తగ్గించడానికి భారతదేశానికే ఉపయోగపడుతుందన్నారు. ఈ వరదలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిని నిర్వాసితులను చేసి జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని కూడా బిశ్వశర్మ గుర్తుచేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్