పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ తో సినిమా చేయడానికి యంగ్ డైరెక్టర్ లు పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కొట్టేసి, సినిమా కంప్లీట్ చేసాడు సుజిత్. ఓ జీ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ ను పక్కా మాస్ యాంగిల్ లో చూపించేందుకు సుజిత్ చాలా కష్టపడ్డాడు. సినిమా షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ అయింది.
Also read : పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు
ఇక సినిమాను సెప్టెంబర్ 25 న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా ఉండే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా మార్కెట్ లో దుమ్ము రేపుతోంది ఈ సినిమా. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో జోష్ స్పష్టంగా కనపడుతోంది. ఇక సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చేందుకు గానూ ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసారు.
Also read : నమ్రతా శిరోద్కర్ న్యూ యార్క్ ఫొటోస్
దసరా కానుకగా వస్తున్న ఈ సినిమాకు భారీ వసూళ్లు టార్గెట్ పెట్టుకున్న నిర్మాతలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలయ్యలను పిలవాలని భావిస్తున్నారు. విజయవాడ ఈవెంట్ కు బాలయ్య, హైదరాబాద్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ లు గా రానున్నారు అని టాక్. ఇక ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఇబ్బందే. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా ఇచ్చిన షాక్ లో ఉన్న ఫ్యాన్స్.. ఈ సినిమా హిట్ కావాలని పూజలు మొదలుపెట్టారు.