Monday, October 27, 2025 10:50 PM
Monday, October 27, 2025 10:50 PM
roots

బాక్సాఫీస్ వద్ద ఛావా సునామీ.. ఈ వీకెండ్ కూడా సెన్సేషన్..!

మరాఠా యోధుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా థియేటర్లలో దుమ్మురేపుతుంది. భారీ కలెక్షన్లు సాధిస్తూ.. వందల కోట్ల కలెక్షన్లు దిశగా వెళ్తోంది. సినిమా విడుదల అయి దాదాపు 15 రోజులు అయినా సరే ఎక్కడా స్పీడ్ తగ్గలేదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాను లోకల్ భాషల్లో కూడా రిలీజ్ చేయాల్సిందే అనే డిమాండ్ వినపడుతోంది. అటు తమిళ, కన్నడ భాషలో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read : తెలుగోళ్ళ తమిళ పిచ్చి.. ఆ డైరెక్టర్ల వెంట పడుతున్నారా…?

ఒక హిందూ రాజు కథను చరిత్ర పుస్తకంలో లేకుండా చేశారని, అలాంటి కథను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ చాలా బాగా చూపించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా గత వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. ఎవరు ఊహించని స్థాయిలో.. ఏకంగా వీకెండ్ 109 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది ఈ సినిమా. కేవలం హిందీ భాషలో మాత్రమే. గతంలో పుష్ప సినిమా వీకెండ్ లో 128 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.. దాదాపు అన్ని భాషల్లో.

Also Read : గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్

ఇక సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేసి ఉంటే పక్కాగా వసూళ్లు భారీగా పెరిగేవని.. ముఖ్యంగా మన తెలుగులో ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. ముఖ్యంగా సినిమాలో విక్కీ కౌశల్ తో పాటుగా అక్షయ్ కన్నా నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇక విక్కీ కౌశల్.. శంబాజీ పాత్రలో, ముఖ్యంగా క్లైమాక్స్ లో చేసిన నటనకు కొంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు. ఇదే ఊపులో ఈ సినిమా కంటిన్యూ అయితే పక్కాగా 600 నుంచి 700 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్