Thursday, February 5, 2026 03:23 AM
Thursday, February 5, 2026 03:23 AM

చేవెళ్ళ బస్సు ప్రమాదానికి 9 కారణాలు, మరణాలు అందుకే పెరిగాయా..?

తెలుగు రాష్ట్రాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కర్నూలు బస్ ప్రమాదం ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. చేవెళ్ళ – వికారాబాద్ మధ్య ఈ ఘటన జరగగా.. మితిమీరిన వేగంతో వచ్చిన కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Also Read : నవంబర్ 15.. ముహుర్తం ఫిక్స్..!

స్థానికులు సహాయక చర్యలకు దిగినప్పటికీ, ఘటనాస్థలికి వెంటనే అంబులెన్స్ చేరుకోలేకపోవడంతో అక్కడి స్థానికులే వారి సొంత వాహనాల్లో గాయపడిన వారిని చేవెళ్ళ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బస్సు కంకరలో కూరుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. జేసీబి సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు అధికారులు. ఇక ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారి పోస్టుమార్టం కొనసాగుతోంది.ఇప్పటివరకు మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కర్నాటక భానూర్ కు చెందిన నాగమణి, గంగారం తండాకు చెందిన తారిబాయి, నజీర్ అహ్మద్ మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. ఈ ఘటనలో రోజుల పసికందు మృతి చెందడం కలిచివేసింది. ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్సగ్రేషియా ప్రకటించింది.

Also Read : జోగి.. కేరాఫ్ కులం కార్డు..!

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.

1. ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్.
2. రోడ్డుపై గుంతలు మరియు మలుపు.
3. బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్.
4. ఢీకొట్టాక బస్సుపై పడిన టిప్పర్.
5. కంకరపై టార్పలిన్ కప్పకపోవడం.
6. ప్రయాణికులపై పడిన కంకర వల్ల మరణాలు పెరగడం.
7. డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లను చీల్చేసిన టిప్పర్.
8. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం.
9. 54 మందికి ఉండాల్సిన బస్సులో 70 మంది ప్రయాణించడం, దీనివల్ల మరణాలు పెరిగాయని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్