Friday, September 12, 2025 09:36 PM
Friday, September 12, 2025 09:36 PM
roots

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చెన్నై..

బాల్ ట్యాంపరింగ్.. ప్రపంచ క్రికెట్ ను కుదిపేసే పదం. ఫిక్సింగ్ కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 2018లో ఆస్ట్రేలియా జట్టు.. సౌత్ ఆఫ్రికా టూర్ లో చేసిన ఈ వ్యవహారం.. ఆ జట్టులో కీలక మార్పులకు వేదిక అయింది. ఇక ఇప్పుడు ఐపిఎల్ కు కూడా ఇది పాకింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు టైటిళ్లు సాధించి విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న చెన్నై జట్టు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. మ్యాచ్ మొదటి బంతికి ముందు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ఖలీల్ అహ్మద్ మధ్య ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లలో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు, అక్కడ ఖలీల్ తన జేబులో నుంచి ఏదో తీయడం కనపడింది. కెమెరా వైపు కాకుండా వెనక్కు తిరిగి.. ఏదో చేసినట్టు కనపడింది. దీనితో చెన్నై బంతిని ట్యాంపరింగ్ చేసిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ను కోరుతున్నారు. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై జట్టు రెండేళ్ళ పాటు నిషేధానికి గురైంది. ఇప్పుడు ఇది నిజం అని తేలితే మాత్రం మరో రెండేళ్ళు పడనుంది.

Also Read: జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!

ఇక దీనిపై చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులను ట్రోల్ చేయడం గమనార్హం. వాళ్ళిద్దరి మధ్య చూయింగ్ గమ్ ఉండవచ్చని.. అంటే.. ఖలీల్ అహ్మద్ చేతికి ఉంగరం ఉందని అది తీసి… కెప్టెన్ కు ఇస్తే అతను జేబులో పెట్టుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కావాలనే చెన్నైని టార్గెట్ చేసారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మోసం చేసి చెన్నై గెలిచింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్