Friday, September 12, 2025 07:41 PM
Friday, September 12, 2025 07:41 PM
roots

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి రంగం సిద్దం..!

ఏపీలో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఐదేళ్ల పాటు నాడు – నేడు అంటూ కేవలం పాఠశాల భవనాలకు రంగులతోనే సరిపెట్టిన వైసీపీ ప్రభుత్వం… విద్యార్థుల జీవితాలతో ఆడుకుందనే చెప్పాలి. పాఠశాలల కుదింపుతో పాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కూడా నిర్లక్ష్యం చూపింది. అలాగే విద్యార్థులకు అందించే పౌష్ఠిక ఆహారంలో కూడా నాణ్యతకు వైసీపీ సర్కార్ తిలోదకాలు ఇచ్చింది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉపాధ్యాయుల బదిలీలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు… ఇలా ఎన్నో అంశాలు ఇప్పటికీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న కూటమి సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : రంగంలోకి వర్మ.. ఇక వారి కోసమే..!

నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ శాఖలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల యూనిఫామ్ విషయంలో మార్పులు చేశారు. ఏ పార్టీ రంగు లేకుండా పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్‌తో పాటు పుస్తకాల్లో కూడా జగన్ పేరు, ఫోటో ముద్రించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలోనే మంత్రి లోకేష్ వెల్లడించారు. యూనిఫామ్‌తో పాటు పుస్తకాల్లో కూడా రాజకీయ నేతల ఫోటోలు లేకుండా చర్యలు చేపట్టారు.

Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?

తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పుస్తకాల మోతతో సతమతం అవుతున్న విద్యార్థులకు కాస్త ఊరట కలిగించేలా లోకేష్ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్‌కేజీ పిల్లలకు కూడా బండెడు పుస్తకాలున్నాయి. వారి వయసుకు మించిన బరువును పిల్లలు ప్రస్తుతం మోస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సామాజిక వేత్తలు ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్.. విద్యార్థులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వారం ఒకరోజు పుస్తకాల మోత నుంచి విముక్తి కలిగించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలవుతోంది. దీన్ని ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నో బ్యాగ్ డే రోజున క్విజ్‌లు, డిబేట్లు, సమీక్షలు నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి లోకేష్ సూచించారు. నో బ్యాగ్ డే పై విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నో బ్యాగ్ డే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్