ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారని అన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత అవసరమని, స్వయం ఉపాధి ద్వారా వారికి మరింత ఆదాయం లభిస్తుందని అన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక ప్రగతికి చేయూత
నడింపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి ముందుగా గంగమ్మ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వారితో కలిసి కోలాటం ఆడారు. ఆపై వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డ్వాక్రా స్థాపించారు. నేడు డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మన వల్ల ఏమీ కాదు అనే భావన నుంచి ముందు బయటకు రావాలి. ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటి నుంచి నేర్చుకుని మందుకు నడవాలి. మహిళల్లో ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి అభినందనీయం. రమాదేవి ఆమె టీం సభ్యులంతా ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మహిళల ఆర్థిక ప్రగతికి పాటుపడుతున్నాం. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాం. టైలరింగ్, మగ్గం, చికెన్ కారీ వర్క్ లో శిక్షణ ఇస్తున్నాం. నడింపల్లిలో 198 మందికి పింఛను అందుతోంది. టిడ్కో కింద 62 గృహాలు, రూ.1.30 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. తల్లికి వందనం పథకం కింద 155 మంది లబ్ధి పొందుతున్నారు. 147 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం అందింది.
Also Read : అమరావతి నిర్మాణ కూలీలలో మావోలు..?
దేశంలో ఏపీ నెంబర్ వన్ గా నిలవాలి
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశారు. చంద్రబాబు గారి దూరదృష్టితో కుప్పానికి నీటి కష్టాలు తీరాయి. కుప్పంలో ప్రతి గ్రామం పచ్చగా ఉండాలన్నదే ఆయన కోరిక. ఇటీవల కుప్పానికి 7 పరిశ్రమలు వచ్చాయి. త్వరలో మరో 8 సంస్థలు రాబోతున్నాయి. గత ఐదేళ్లలో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతికారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ లభించింది. గంజాయిపై ఉక్కుపాదం మోపారు. మహిళల రక్షణ కల్పించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేము ఎంత చేసినా కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేము. నేను నిజం గెలవాలి యాత్ర చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు, కుప్పం ప్రజల ఎంతో సహకరించారు. అలాగే…2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గారి తరపున నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు మీరు నాపై చూపిన అభిమానాన్ని మర్చిపోలేను.
Also Read : ఉద్యమాన్ని ఆపేది లేదు.. మావోల సంచలన లేఖ
కృష్ణమ్మకు జలహారతి
తుమ్మిసి పెద్ద చెరువు దగ్గర జల హారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు శాంతిపురం నుంచి తుమ్మిసి వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. భువనేశ్వరి గారు ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఆధార్ తప్పనిసరి అని మహిళా కండెక్టర్ చెప్పింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నావని మహిళా కండెక్టర్ ను భువనేశ్వరి గారు అభినందించారు.

