2024 లో భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన కూటమిపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. గత ఐదేళ్లపాటు జరిగిన విధ్వంసం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో పెద్దగా జరగలేదు. అయితే ఇప్పుడు ఒక్కో అభివృద్ధి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గాల్లో రోడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.
Also Read : అరంబిందో అక్రమాలపై ఫోకస్.. డోంట్ కేర్ అంటున్న శరత్ చంద్రారెడ్డి..!
సంక్రాంతి లోపు రోడ్లపై గుంతలు ఉండకూడదని ఉంటే స్థానిక ఎమ్మెల్యేదే బాధ్యత అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ఇక ఇదే టైంలో ఎమ్మెల్యేలకు కొన్ని టార్గెట్లు విధిస్తున్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విధంగా అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునే విధంగా వారికి కొన్ని టార్గెట్లు పెట్టారు. పెన్షన్ల విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో… నూతన రాజధాని అమరావతి విషయంలో, రోడ్లు అలాగే రైతుల సమస్యలకు సంబంధించి పలు అంశాల్లో వారికి టార్గెట్లు పెట్టారు.
ప్రజల్లోకి వెళ్లి… వీటికి సంబంధించిన వీడియోలను ఫోటోలను అలాగే ప్రజల అభిప్రాయాలకు సంబంధించిన వివరాలను అన్ని కూడా పార్టీ ఆఫీసుకు అందించాల్సి ఉంటుంది. జనసేన పార్టీ అయితే జనసేన పార్టీ కార్యాలయానికి బిజెపి అయితే వారి కార్యాలయానికి అందించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు టార్గెట్ లు పెట్టినట్టు సమాచారం. రాబోయే 15, 20 రోజులపాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండే విధంగా అలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.
Also Read : సేఫ్ జోన్ లో కొడాలి.. వల్లభనేని
ప్రస్తుత పరిస్థితులను వైయస్ జగన్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో చంద్రబాబు జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా ఇసుక అలాగే సహజ వనరుల దోపిడీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా స్థానిక కార్యకర్తలతో ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం వివరాలు సేకరిస్తుంది. రాబోయే 15 20 రోజులు ఎమ్మెల్యేలకు ఒకరకంగా పరీక్ష కాలం అని చెప్పాలి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు పాస్ అవుతారు.. ఎంతమంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతారో చూడాలి.