Tuesday, October 28, 2025 07:29 AM
Tuesday, October 28, 2025 07:29 AM
roots

ఆ ముగ్గురినీ ఎవరూ కాపాడలేరా? బాబు పకడ్బందీ వ్యూహం..!

గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన ముగ్గురు ఐపిఎస్ ఆఫీసర్ల కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. హీరోయిన్ విషయంలో స్థాయి మరిచి ప్రభుత్వాధినేతలు చెప్పినట్టు నడుచుకున్న కారణంగా ముగ్గురు ఐపిఎస్ లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు నిన్న జీవో విడుదల చేశారు. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592 లతో మూడు జీవోలను విడుదల చేసింది.

కేసు విచారణలో వెల్లడి అయిన పలు విషయాలను ఆ జీవోల్లో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. ఆ జీవోలను పరిశీలిస్తే… కీలక సాక్ష్యాలను ప్రభుత్వం సేకరించే చర్యలకు దిగిందని అర్ధం అవుతుంది. ఇప్పుడు ఐపిఎస్ లు బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు అంటున్నారు నిపుణులు. దానికి గల కారణం ఏంటీ అంటే… గతంలో జగన్ సిఎం గా ఉన్నప్పుడు ఎవరిని అయినా టార్గెట్ చేస్తే వెనుకా ముందు చూడకుండా కేసులు పెడుతూ ఉండేవాళ్ళు. జాస్తి కృష్ణ కిషోర్, ఏబీ విషయంలో ఇదే జరిగింది. వాళ్ళను సస్పెండ్ చేసే వరకు జగన్ నిద్రపోలేదు.

AB Venkateswarao

కానీ వాళ్ళు క్యాట్ కి వెళ్లి విజయం సాధించారు. తప్పు లేదు కాబట్టి ఉన్నత న్యాయస్థానాల వరకు వెళ్లి పోరాడి విజయం సాధించారు.అది జగన్ మూర్కత్వం కాబట్టి ఆల్ ఇండియా సర్వీసు అధికారులను టార్గెట్ చేసినా బయట పడ్డారు. కాని ఇప్పుడు ఉన్నదీ చంద్రబాబు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు చంద్రబాబు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు. ఈ కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి ప్రభుత్వం వద్ద. అందుకే విచారణలో పెద్దగా జాప్యం జరగలేదు. విచారణ ఆపే ప్రయత్నం జరిగినా ఆగలేదు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు.

Chandrababu & YS Jagan

ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా సరే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటపడటం అనేది దాదాపుగా అసాధ్యం అనే మాట వినపడుతోంది. గురి చూసి చంద్రబాబు కొట్టిన మొదటి దెబ్బకి వైసీపీ అధిష్టానం బిత్తరపోయింది అని సమాచారం. ఇంత వేగంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని వాళ్ళు ఊహించలేదని తెలుస్తుంది. చంద్రబాబు తన సహజ వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకోవటం వెనుక ప్రజలు, పార్టీ క్యాడర్ ఒత్తిడి కూడా ఒక కారణం అని తెలుస్తుంది. ఇప్పటికి కూడా పరిపాలనలో సహాయ నిరాకరణ చేస్తున్న అధికారుల కి కూడా ఒక హెచ్చరికలా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇంత వేగంగా నిర్ణయం తీసుకుని అధికారులకి కూడా షాక్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ ముగ్గురు అధికారుల తదుపరి కార్యాచరణ ఏంటనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్