వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూనే గత ప్రభుత్వం వైద్య రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందనేది అందరికీ క్లారిటీ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించిన వైఖరి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలు పెట్టిన ఎయిమ్స్ విషయంలో అప్పటి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. శాశ్వత నీటి పరిష్కారం చూపించాలని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా… అప్పట్లో ఫలితం లేకుండా పోయింది.
Also Read : చంద్రబాబుకు షర్మిల సలహా.. ఆ ఒక్కటి జాగ్రత్త…!
సరిపడా నీటి సరఫరాకు అప్పటి ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. ఖర్చులు భరించాలని ఎయిమ్స్ అధికారులకు స్పష్టం చేసింది. ఇక నీళ్లు లేకనే వైద్య సేవలు విస్తరణకు ఆటంకం కలుగుతుందని ఆరోపణలు వచ్చాయి. కేంద్రం లేఖ రాసినా సరే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దాదాపు 1600 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ కు 2015లో శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో శాశ్వత నీటి సరఫరా విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి అధికారులు పలు మార్లు లేఖలు రాస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది.
Also Read : సీఎం చంద్రబాబే.. చీఫ్ మాత్రం పెద్దిరెడ్డి.. చిత్తూరులో వింత…!
ఇక తాజాగా మంగళగిరి ఎయిమ్స్ కు కూటమి ప్రభుత్వం శాశ్వత నీటి వసతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక చొరవ తీసుకుని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించింది. గత నెల 26 నుంచి రోజుకు 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అంతకుముందు మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరపాలక సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవారు. అందుకు ఎయిమ్స్ సుమారు నాలుగు కోట్లు ఖర్చు పెట్టేది. అయినా శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక తాజాగా కృష్ణానది నీటిని గుంటూరు ఛానల్ ద్వారా ఎయిమ్స్ కు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 54 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది.




