ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కీలక మార్కులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందా…? సమర్థవంతంగా పనిచేయని మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉందా…? అంటే అవునని సమాధానం వినపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మంత్రుల పనితీరు విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త మంత్రులకు క్యాబినెట్లో చోటు కల్పించారు. ఉత్సాహంగా పనిచేస్తారని కారణంతో కొంతమంది యువ మంత్రులకు అవకాశం ఇచ్చినా చాలామంది సమర్థవంతంగా పనిచేయడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి.
Also Read : నానీని కాపాడుతుంది ఎవరూ…? తిట్టినా పౌరుషం రాదెం…?
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో మంత్రి విషయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొత్త మంత్రి విషయంలో చంద్రబాబునాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని అసెంబ్లీ సమావేశాలను కూడా ఆయా మంత్రులు సీరియస్గా తీసుకోవడం లేదు అని అభిప్రాయం చాలా వరకు వినపడుతోంది. వారికి కీలక శాఖలను అప్పగించిన సరే సరైన సమాధానం లేదు అనే అభిప్రాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో ఉంది. కీలక విషయాల్లో అలసత్వం ప్రదర్శించడం అలాగే మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం కనీసం తమ శాఖలపై అవగాహన పెంచుకోకపోవడం పట్ల చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు.
Also Read : క్రికెట్ కు సైంటిస్ట్ గుడ్ బై… మిస్ యూ అశ్విన్
దీనితోనే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి త్వరలోనే ఉద్వాసన పలికే అవకాశం కనబడుతోంది. ఆయన స్థానంలో ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ప్రభుత్వంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మారుస్తారా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే ఒక యువనేతకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా సమాచారం.