Saturday, September 13, 2025 01:11 AM
Saturday, September 13, 2025 01:11 AM
roots

దావోస్ లో ఏపీ స్పెషల్ అట్రాక్షన్.. కేంద్రం ఫుల్ సపోర్ట్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇప్పుడు సిఎం చంద్రబాబు చాలా పట్టుదలగా కనపడుతున్నారు. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చే విధంగా చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. త్వరలోనే ఏపీ సర్కార్ దావోస్ వెళ్లనుంది. అక్కడి నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకు రావాలని అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించాలని చంద్రబాబు అండ్ కో రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తోంది.

Also Read : ఏపీలో గేమ్ చేంజ్ చేయనున్న పవన్ కళ్యాణ్

దావోస్ లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ నుంచి చంద్రబాబు నేతృత్వంలో టీం హాజరు అవుతుంది. ఈమేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది రాష్ట్ర సర్కార్. జనవరి 20 నుంచి 24 వరకూ నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ తదితరులు. ఈ నెల 19 తేదీన దావోస్ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు వెళ్తారు.

Also Read : ఫార్ములా ఈ కారు కేసు.. లొట్ట పీసు కేసు..!

రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను దావోస్ లో వివరించనున్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్న అవకాశాలను వివరించేలా దావోస్ లో పర్యటన చేయనున్నారు. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోస్ లో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకీ ఓ ప్రత్యేకంగా స్టాల్ రిజర్వు చేసింది కేంద్రం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్