Saturday, September 13, 2025 06:43 AM
Saturday, September 13, 2025 06:43 AM
roots

మోడీ వైజాగ్ టూర్.. బిజీ బిజీగా చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రానున్న నేపధ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : అసలు అమరావతిలో ఏం జరుగుతోంది..?

ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పలు సూచనలు చేసారు. యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను సీఎంకు యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు.. వివరించారు. బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ వివరించారు. 607 సచివాలయాల సిబ్బంది ఈ యోగాడే కు హాజరవుతున్న వారిని సమన్వయం చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Also Read : వారికి పదవులు ఉన్నట్లా.. లేనట్లా..?

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్న సీఎం.. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 06:30 నుంచి 08 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి యోగాడే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్