Friday, September 12, 2025 07:27 PM
Friday, September 12, 2025 07:27 PM
roots

సీఎం పర్యటన… ఆ ప్రాంత వాసుల కల నెరవేరేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం ఒకటి. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్‌లను వేరు చేసి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో ఒంగోలు, కందుకూరు డివిజన్‌లకు న్యాయమే జరిగినప్పటికీ… మార్కాపురం డివిజన్‌ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఓ వైపు నల్లమల అటవీ ప్రాంతం, తాగు, సాగు నీటి వనరులు లేక తీవ్ర ఇబ్బందులు, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కావడంతో… మార్కాపురం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ… గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా… పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు చేసింది. దీంతో ఒంగోలు కేంద్రంగానే ఉన్న ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఉండిపోయింది. అయితే ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు ఆ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్కాపురంలో నిర్వహించనుంది. ఇందుకోసం ఈ నెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు ప్రకటన వస్తుందని పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే వైసీపీ నేతలు ఇదే హామీ ఇచ్చారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని జగన్ సహా.. ఆ పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో… మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఆ తర్వతా వైసీపీ నేతలు మడమ తిప్పడంతో.. ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

Also Read : నటరాజన్ టీమ్ రెడీ.. టీపీసీసీలో పదవులు ఎవరికంటే..?

పశ్చిమ ప్రకాశం ప్రాంతం పరిధిలోని 5 నియోజకవర్గాల్లో ఇప్పుడు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2024 ఎన్నికల సమయంలో కూడా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మార్కాపురం వస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రకటన ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నారు. అలాగే దాదాపు 20 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతున్న పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై కూడా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికల ముందు హడావుడిగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే పనులు పూర్తి కాకుండానే పనులు ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టు కోసం రూ.320 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీంతో పనుల్లో వేగం పుంజుకుంది. ఏది ఏమైనా… సీఎం చంద్రబాబు పర్యటనపై పశ్చిమ ప్రకాశం వాసులు గంపెడాశ పెట్టుకున్నారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై కూడా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్