ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నుంచి అమరావతి పనులను పూర్తిస్థాయిలో మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అమరావతిని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమరావతికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రమోషన్ కోసం వాడుకోవాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ అలాగే రానాను ఆంధ్రప్రదేశ్ ఐటి పాలసీకి సంబంధించి వాడుకునే విధంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మెగా హీరో రామ్ చరణ్ హీరో నాని సహా మరి కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి తో పాటుగా రాష్ట్రంలో టూరిజం ని కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
Also Read : ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. సవాళ్లు ఇవే
తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కేరళ, గోవా, పాండిచ్చేరి తరహాలో అభివృద్ధి చేయడమే కాకుండా స్టార్ హోటల్స్ నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అమరావతిలో కూడా పెద్ద ఎత్తున స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలని చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు. గత ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పూర్తిస్థాయిలో దెబ్బతిన్న నేపధ్యంలో దాని నుంచి కోలుకోవడానికి ఇప్పుడు ఉన్న అన్ని మార్గాలను వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సినిమా పరిశ్రమ సహకారం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.