Friday, September 12, 2025 11:31 PM
Friday, September 12, 2025 11:31 PM
roots

చంద్రబాబు అడ్రస్ మారుతోంది 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్రస్ మారనుంది. ఇప్పటి వరకు అమరావతిలో చంద్రబాబుకు శాశ్వత నివాసం లేదనే ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పేందుకు సిద్దమైంది. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత నివాసం దిశగా అడుగులు వేస్తున్నారు. 2014 లో ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి అంటే… గత పదేళ్లుగా ఆయన కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథిగృహంలో నివాసం ఉంటున్నారు. దీనిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

Also read : జగనన్నను కార్యకర్తలే వద్దంటున్నారా…..?

అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో ముందు అడుగు పడింది. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటిస్థలం కొనుగోలు చేసింది నారా కుటుంబం. వివిధ ప్రాంతాల్లో ఇంటి స్థలం కోసం అన్వేషించిన అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ స్థలాన్ని ఎంపిక చేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థలాన్ని నారా భువనేశ్వరి స్వయంగా పరిశీలించారు. పలు మార్పులు కూడా చేయించారు. 25 వేల చదరపు గజాల ఈ ప్లాట్‌ ఈ-6 రోడ్డుకు ఆనుకుని ఉందని మీడియా వర్గాలు తెలిపాయి.

Also read : కాఫీ ఫస్ట్ సిప్ తాగినప్పుడు శరీరంలో వచ్చే మార్పులు తెలుసా…?

ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్‌ ప్లాట్‌ అని సమాచారం. ఇప్పటికే కొనుగోలు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించారట. ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు ఉండటం గమనార్హం. రాజధానిలో కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ మార్గం కూడా దీని పక్కనుంచే వెళ్తుందట. అమరావతిలో కీలకమైన గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ తదితర కీలక భవనాలు ఈ ప్లాట్‌కు రెండు కి.మీ. పరిధిలోనే ఉండటం గమనార్హం. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి, మిగిలిన స్థలాన్ని ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్‌ తదితరాలకు వినియోగిస్తారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్