ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీ చేరుకోనన్నారు చంద్రబాబునాయుడు. మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమార్తె రిసెప్షన్ కు వీరిద్దరూ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం కూడా వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే ఉండనున్నట్టు సమాచారం.
Also Read: చంద్రబాబు నిజంగానే మారారా..?
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురిని చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారట. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని కార్యాలయం కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 16 లేదా 18వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: నాగబాబుకు షాక్ తప్పదా..?
9 ఏళ్ళ క్రితం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతుంది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారట. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర అటవీ శాఖ మంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.