Friday, September 12, 2025 03:14 PM
Friday, September 12, 2025 03:14 PM
roots

పింఛన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో పథకాల అమలులో అధికారుల కంటే కూడా వలంటీర్ల పెత్తనమే ఎక్కువగా ఉందని విమర్శించారు చంద్రబాబు. కొన్నిసార్లు లబ్దిదారులపై దాడులు కూడా చేశారని విమర్శించారు. అలాగే పథకాల అమలులో వలంటీర్లు చేతివాటం ప్రదర్శించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎలాంటి అలసత్వానికి తావులేదని.. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు విషయంలో ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. దాని ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులతో అధికారులు పని చేయాలని చంద్రబాబు సూచించారు.

Also Read : ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్

పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటిన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల వంటి అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే దేవాలయాల్లో సౌకర్యాలపై కూడా చంద్రబాబు సమీక్ష చేశారు. పథకాల అమలులో ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తారని.. అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకోవాలని సూచించిన చంద్రబాబు… ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Also Read : రాధ పరిస్థితి ఏంటీ..? చంద్రబాబు ఆలోచన ఏంటీ..?

అదే సమయంలో పింఛన్ల పంపిణీ పై కీలక ఆదేశాలు జారీ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 7 గంటలకు ఫించన్ల పంపిణీ మొదలుపెట్టి.. సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని… ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సిఎం సూచించారు. ఇంటి వద్ద కాకుండా.. పొలంలోనో, ఆసుపత్రిలోనో, ఇతర ప్రాంతంలోనో పింఛను పంపిణీ చేసినట్లు తేలితే.. వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు. పింఛన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, లబ్దిదారులతో గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్