Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

బాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా..?

చిన్న పామునైనా సరే.. పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. ఈ మాటను చంద్రబాబు బాగా నమ్ముతారు. చిన్న స్థాయి నేతపైన అయినా సరే.. చర్యలు ఘాటుగానే ఉంటాయి. అది ఉద్యోగుల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఆచరిస్తారు. నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన మార్క్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అవసరమైతే బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు కూడా చంద్రబాబు రెడీ అంటున్నారు. ఎదుటి పార్టీలో గట్టిగా మాట్లాడే వారిపైకి ధీటైన నేతలనే రంగంలోకి దింపుతున్నారు. దీంతో చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలో అర్థం కాక వైసీపీ అధినేత సహా సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు.

Also Read: బాబు 4.0.. బీ కేర్ ఫుల్..!

వైసీపీకి శాసన మండలిలో బలం ఎక్కువ. పైగా ఓటమిని ముందే ఊహించారో ఏమో.. మండలిలో ఎక్కువగా బీసీలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరిలో సగం మందికి విషయ పరిజ్ఞానం లేదు. మిగిలిన వారిలో గట్టిగా మాట్లాడే వారు కూడా మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, వరుదు కల్యాణి తప్ప… మిగిలిన వారంతా సభకు వచ్చామా.. వెళ్లామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం వంటి ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు సభలో మాట్లాడిన దాఖలాలే లేవు. బొత్స సత్యనారాయణ మాట్లాడితే.. ఆయనకు బీసీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటుగా బదులిస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో అనురాధ వేసిన ప్రశ్నలకు బొత్స సత్యనారాయణ జవాబు చెప్పలేక పోయారు. పైగా బీసీ మహిళ కావడంతో బొత్స సైలెంట్ అయ్యారు కూడా.

Also Read: జనసేన వల్ల టీడీపీకి లాభమా.. నష్టమా..?

ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న మరో నిర్ణయం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మాను ఎంపిక చేశారు. తొలుత గ్రీష్మ ఎంపికపై అంతా విమర్శలు చేసినప్పటికీ.. బాబు గేమ్ ప్లాన్ గురించి తెలియడంతో షాక్ అవుతున్నారు. అసెంబ్లీలో వైసీపీ తరఫున సరైన లీడర్ లేనప్పటికీ.. మండలిలో మాత్రం టీడీపీని పదే పదే ఇబ్బంది పెడుతున్న నేత వరుదు కల్యాణి. చంద్రబాబు సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. నవ మాసాలు, నవ మోసాలు, అడబిడ్డ నిధి ఎప్పుడు.. అంటూ తరచూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Also Read: పొలిటికల్ కెరీర్‌పై తేల్చేసిన బాలినేని..!

వరుదు కల్యాణి ఒకటి రెండు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ జవాబిచ్చినప్పటికీ.. బీసీ మహిళ కావడంతో కల్యాణిపై సానుభూతి పెరుగుతోంది. దీంతో వరుదు కల్యాణి పైకి ఎస్సీ అస్త్రం ప్రయోగిస్తున్నారు చంద్రబాబు. ఇకపై సభలో కల్యాణి మాట్లాడితే.. ఆమెకు గ్రీష్మ కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉత్తరాంధ్ర వాసులు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలే కావడంతో.. ధీటుగానే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి సీఎం చంద్రబాబు ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే.. సభలో ఇద్దరి మధ్య చర్చ జరిగే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్