Saturday, September 13, 2025 03:23 AM
Saturday, September 13, 2025 03:23 AM
roots

బాబు 4.0.. బీ కేర్ ఫుల్..!

ఏ ఊరికి వస్తానో చెప్పను… కానీ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో తేడా వస్తే మాత్రం అందుకు పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిదే.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీట్ వార్నింగ్ అచ్చారు. స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పను.. హెలికాఫ్టర్ ఎక్కడానికి కేవలం 2 – 3 గంటల ముందు మాత్రమే ఆయా జిల్లాల కలెక్టర్‌కు సమాచారం ఇస్తా.. నేరుగా ఆ ఊరికి వస్తా.. పరిస్థితుల్లో తేడా వస్తే మాత్రం.. 9 నెలలు సమయం ఇచ్చాను కదా.. పరిస్థితులు ఎందుకు మారలేదో ప్రశ్నిస్తా.. చెప్పే బాధ్యత అక్కడి కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి అధికారి పైన ఉందన్నారు చంద్రబాబు.

Also Read : పవన్ టార్గెట్ అదే.. అందుకే తేనె తుట్టును కదిపారా…?

1995లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు.. జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, పచ్చదనం – పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించారు. సీఎం పర్యటనపై ముందు రోజు రాత్రి ఆ జిల్లా కలెక్టర్‌కు సమాచారం వస్తుంది. తెల్లారే సరికి సీఎం అక్కడ దిగే వారు. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెట్టేవారు. ఏదైనా తప్పు చేసినట్లు సీఎం గుర్తిస్తే చాలు.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లు చంద్రబాబు దృష్టికి వస్తే చాలు.. ఆన్ ది స్పాట్ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు కూడా. ఇదే ప్రధాన కథనంగా అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా వచ్చింది.

Also Read : జనసేన వల్ల టీడీపీకి లాభమా.. నష్టమా..?

అయితే ఇప్పుడు మాత్రం ఆకస్మిక తనిఖీలపై చంద్రబాబు ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే 9 నెలలు గడువిచ్చారు కూడా. అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక తనిఖీలు మళ్లీ మొదలు పెడతా అంటూ ఇప్పుడే ప్రకటించారు. ఇప్పటి నుంచి పని చేయండి.. 9 నెలలు సమయం ఇచ్చాను.. చేయగలిగిన సమస్యలను పరిష్కారం చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా చూసే బాధ్యత మీపై ఉందన్నారు. అదే సమయంలో తనలో వచ్చిన మార్పును కూడా వివరించారు. గతంలో ఎలాంటి సమయం ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు మాత్రం అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి అప్పుడు పరిగెత్తే బదులుగా.. ఇప్పుడే పరిగెత్తాలని కూడా సూచించారు. ఇప్పటి నుంచి లక్ష్యం పెట్టుకుని పని చేస్తే… అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారన్నారు సీఎం చంద్రబాబు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్