మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ఇండియా, ఎన్డియే కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తెలంగాణా, కర్ణాటక ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలను బిజెపి అత్యంత కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. హర్యానా ఎన్నికల్లో చచ్చి చెడి గెలిచిన బిజెపి… మహారాష్ట్రలో ఎలా అయినా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.
Also Read : ఏందన్నా ఇది… సిగ్గుగా లేదా..?
ఈ నేపధ్యంలో అన్ని వర్గాల ఓట్లను టార్గెట్ చేస్తోంది బిజెపి నాయకత్వం. కేంద్రంలో బిజేపిని ఇబ్బంది పెట్టడానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఇతర విపక్షాలకు అత్యంత కీలకం. శివసేన, ఎన్సీపీలో రెండు వర్గాలు ఉండటం… సెంటిమెంట్, సానుభూతి అంశాలు కీలకం కావడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఎన్డియే, ఇండియా కూటమి… కీలకమైన కన్నడ, తమిళ, తెలుగు ఓట్లకు గాలం వేస్తోంది. తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రచారం నిర్వహించి ఘాటు వ్యాఖ్యలు చేసారు.
Also Read : జగన్ ని నమ్ముకుంటే తమ్మినేనికి పట్టిన గతే అందరికీ..!
ఇక 16, 17 తేదీల్లో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ప్రచార తేదీలు కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్… త్వరలోనే ప్రచారానికి వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం నేపధ్యంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేసారు బిజెపికి వ్యతిరేకంగా… ఈ సమయంలో చంద్రబాబు వెళ్లి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు, పవన్ కళ్యాణ్… రేవంత్ పై ఏమైనా విమర్శలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.