Friday, September 12, 2025 03:00 PM
Friday, September 12, 2025 03:00 PM
roots

చంద్రబాబు సింగపూర్ టూర్ సక్సెస్.. ఏపీకి రానున్న కంపెనీలు ఇవే..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటన ఆసక్తిగా సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోన్న చంద్రబాబు సర్కార్.. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో భేటీ అయింది. రాష్ట్రంలో గతంలో మాదిరి పరిస్థితులు లేవని, ప్రశాంత వాతావరణం నెలకొందని, కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరింది. అందుకు తగ్గ అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇస్తోంది.

Also Read : టీసీఎస్ నిర్ణయం వెనుక కారణం అదేనా..?

సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. 10 కి పైగా సమావేశాల్లో ఒకే రోజు పాల్గొన్నారు. అటు సింగపూర్ తెలుగు సమాజాన్ని కూడా రాష్ట్రం వైపు ఆహ్వానించే ప్రయత్నం చేసారు చంద్రబాబు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ ఐటీ దిగ్గజాలతో భేటీ అవుతున్నారు.

క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తో చంద్రబాబు భేటీ అవుతారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ను భాగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Also Read : పోటీ చేస్తున్నాం.. టీటీడీపీ కీలక ప్రకటన 

గతంలో సింగపూర్ అమరావతి నిర్మాణం నుంచి వెనక్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో కూడా ఈ టూర్ లో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను కూడా ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సందర్శించనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్