Friday, September 12, 2025 03:00 PM
Friday, September 12, 2025 03:00 PM
roots

సింగపూర్ లో చంద్రబాబు.. టార్గెట్ ఇదే

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు, 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు పర్యటిస్తారు.

Also Read : కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!

ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్ తో పాటు మలేషియా, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ , థాయ్ లాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు అవుతారు.

సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సదస్సుకు ఏర్పాట్లను ఏపీ ఎన్నార్టీ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చిస్తారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్దిలో భాగస్వాములు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. జీరో పావర్టీ – P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను సిఎం కోరనున్నారు.

Also Read : రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్

పలు దేశాలకు ఎపి నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై చర్చిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై చర్చ జరగనుంది. స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సిఎం బృందం సందర్శించనుంది. సిఎం చంద్రబాబుతో సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి.నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్