Friday, September 12, 2025 09:24 PM
Friday, September 12, 2025 09:24 PM
roots

మంత్రులు, నాయకుల అత్యుత్సాహం పై బాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఏమో గాని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే కామెంట్స్ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సిఎం చంద్రబాబుకు వీళ్ళ వ్యవహారశైలి పెద్ద సమస్యగా మారుతుందని మీడియా వర్గాలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విషయం ఏంటీ… వీళ్ళ వ్యవహారశైలి చంద్రబాబు ఎందుకు తలనొప్పిగా మారుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం.

సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాల విషయంలో సిఎం ఆఫీసు నుంచి లేదా సంబంధిత శాఖల నుంచి అధికారిక ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటారు. మీడియా సమావేశం పెట్టి సదరు మంత్రి లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధి విధానాలను ప్రకటిస్తూ ఉంటారు. ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా సరే ఇదే విధంగా ఉంటుంది. అయితే ఏపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అంతర్గత నిర్ణయాలు బయటకు చెప్పేస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయం బయటకి రాకముందే తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టర్ల రూపంలో బయటకి వస్తుండటంతో సిఎంఓ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విధాన నిర్ణయం తీసుకునే ముందు జరుగుతున్న చర్చల వివరాలను ఇలా సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద సమస్యగా ఉందని అధికారులు భావిస్తున్నారు.

తల్లికి వందనం విషయంలో అంత రచ్చ కావడానికి ఇదే కారణం అని అంటున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్ విషయంలో కూడా ఒక మంత్రి గారు అత్యుత్సాహం చూపించి ప్రభుత్వం లేక సంబంధిత మంత్రి అధికారికంగా నిర్ణయం ప్రకటించకుండానే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన విషయాన్ని కొందరు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా మంత్రి గారిని బాబు సున్నితంగా మందలించారట. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని, మంత్రుల పేషీల్లో ఉన్న కొందరు వైసీపీ బంధువులు ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కామెంట్స్ వినపడుతున్నాయి. వీటి మీద సిఎం చంద్రబాబు కసరత్తు చేసి అవసరమైతే మంత్రులకు హెచ్చరికలు పంపాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్