ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధికార ఎన్డియే కూటమికి తలనొప్పిగా మారాయి. కొందరు ఎమ్మెల్యేలు వెనుకా ముందు చూడకుండా చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు చికాకుగా మారాయి. దాదాపు వారం రోజుల క్రితం ఎమ్మెల్యే బొండా ఉమా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా సిఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి పయ్యావుల కేశవ్ తో సమావేశం అయ్యారు.
Also Read : హైదరాబాద్ వరదలు.. సైనికులను పవన్ కీలక సూచనలు..!
బొండా ఉమా వ్యాఖ్యలతో పాటుగా నందమూరి బాలకృష్ణ వర్సెస్ కామినేని శ్రీనివాసరావు వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే బొండా ఉమాను పార్టీ ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ – కామినేని వ్యవహారంపై కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. దీనితో మంత్రి పయ్యావుల.. ఇద్దరితో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.
Also Read : ఎమ్మెల్యేలు ఆ పనులు చేయాలి.. చంద్రబాబు కీలక ప్రసంగం
ఇక బాలకృష్ణ దీనిపై ఇంకా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఆయనను కూడా వివరణ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బొండా ఉమా, బాలకృష్ణ వ్యాఖ్యలు జనసేన వర్సెస్ టీడీపీగా వాతావరణం మార్చాయి. ఈ విషయంలో జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అటు మెగా అభిమానులు సైతం ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసారు. ఇది క్రమంగా టీడీపీ వర్సెస్ జనసేనగా వాతావరణం మారింది. దీనితో సిఎం చంద్రబాబు ఎంటర్ అయినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.