ఎవరైనా సరే… ఏ స్థాయి అధికారి అయినా సరే… బంట్రోతు మొదలు.. ఐఏఎస్ స్థాయి అధికారి వరకు ఎవరైనా… రూల్ బుక్ ఫాలో అవ్వాలి తప్ప… పార్టీ నేతలకు వత్తాసు పలకకూడదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నాటి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తారు కొందరు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు. నాటి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే… వారిపై చర్యలు తీసుకుంది జగన్ సర్కార్. కరోనా సమయంలో మాస్క్‌లు ఇవ్వాలని కోరిన డా.సుధాకర్‌ను వేధించడమే కాకుండా… మతిభ్రమించినట్లు చిత్రీకరించి చిత్రహింసలు పెట్టి మరీ చనిపోయే వరకు తీసుకెళ్లారు. ఇక ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి.
Also Read : చంద్రబాబు సంచలన నిర్ణయం..!
చివరికి ఎన్నికల సమయంలో కూడా కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల తీరులో మార్పు వస్తుందని అంతా భావించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా… ఇప్పటికీ కొందరు ఉద్యోగులు మాత్రం నాటి వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. చివరికి సీఎం చంద్రబాబు మాట కూడా లెక్కచేయటం లేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టులు పెట్టే వారిని, మహిళలను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ఇప్పటికే ఏపీలో దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టారు.
అయితే అధికారులు మాత్రం అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా అరెస్టు చేసినప్పటికీ… జస్ట్ 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. దీంతో బయటకు వచ్చి మళ్లీ అదే మాదిరిగా ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఇక గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చంపేస్తా అంటూ బెదిరించడంతో పాటు మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ పై కొందరు పోలీసులు చూపిస్తున్న ప్రత్యేక అభిమానం ఇప్పుడు పోలీస్ శాఖ పనితీరునే ప్రశ్నార్థకంలో పడేస్తోంది.
Also Read : కేబినేట్ లో నిర్ణయాలు ఇవే, అక్రమార్కులకు మూడినట్టే
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు కోర్టులో వాయిదాకు తీసుకువచ్చారు. తిరిగి జైలుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ పెట్టించారు. ఇదేం పెద్ద విషయం కాదు. అయితే ఆ సమయంలో ఆ హోటల్‌లో ఉన్న కొందరు పోలీసుల తీరును తప్పుబట్టారు. వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల ఎదుటే బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న అనిల్ అనుచరులు వారిపై దాడికి కూడా చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అనిల్ మనుషులను ఏ మాత్రం కంట్రోల్ చేయకపోగా.. హోటల్‌కు వచ్చిన కస్టమర్లనే బూతులు తిడుతూ పంపేశారు.
ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అసలు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ వెంట అనుచరులను ఎలా అనుమతించారు… పక్కన వారిపై దాడి చేసిన అనిల్ అనుచరులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు… ఓ రౌడీ షీటర్‌ను కోర్టుకు తరలిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు కూడా ఎందుకు తీసుకోలేదు… పోలీసుల ఎదుటే పక్కనున్న వారిపై అనిల్ రెచ్చిపోతుంటే… పోలీసులు ఏం చేస్తున్నారు… ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఆ శాఖ పనితీరుకు ప్రశ్నార్థకంగా మారాయి.
Also Read : పోలవరం విషయంలో కీలక ముందడుగు
దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసు శాఖ ఏడుగురు పోలీసులపై వేటు వేసింది. ఇక మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదని… ఇకపై ఎవరైనా సరే… ఎవరికైనా సరే… భజన చేస్తే తాట తీస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.




