Monday, March 16, 2026 10:17 PM
Monday, March 16, 2026 10:17 PM

పార్టీలో చంద్రబాబుకు ఎందుకీ తలనొప్పి..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సొంత పార్టీ నేతల వ్యవహారశైలి సిఎం చంద్రబాబుకు ఇప్పుడు సవాల్ గా మారింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల ప్రవర్తనపై వస్తున్న ఫిర్యాదులు పార్టీ అధినేతను అసహనానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఉత్సాహం కొందరి నేతల్లో అతివిశ్వాసంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ఇజ్రాయిల్ ప్రధాని ఎక్కడ..? అది డీప్ ఫేక్ వీడియో..?

ముఖ్యంగా ప్రజలతో ప్రవర్తించే తీరు, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాల్లో నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరిపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సీనియర్ నేతలకు, కొత్తగా వచ్చిన యువ నేతలకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ లోకేశ్ పర్యవేక్షిస్తుండటంతో, దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కొందరు సీనియర్లు నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు రాసిన లేఖలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు నేతలు వివాదాల్లో చిక్కుకోవడం బాబుకు మింగుడుపడటం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కొందరు నేతల తీరు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం దీనికి నిదర్శనం. ఈ వ్యవహారంపై వైసీపీ ఇప్పటికే విమర్శలు తీవ్రతరం చేసింది. డ్రగ్స్ పై ఏపీ సర్కార్ పోరాటం చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం అయింది.

Also Read : గిల్ కెరీర్ కు ఆ ముగ్గురు ఎండ్ కార్డు..!

అటవీ శాఖ డ్రైవర్‌ పై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని స్వయంగా చంద్రబాబు ఆదేశించడం ద్వారా తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా వదిలేది లేదనే సంకేతాలను పంపారు. కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా నేతల వైఖరిలో మార్పు రాలేదు. ప్రజలు మనకు భారీ మెజారిటీ ఇచ్చింది అధికారాన్ని అనుభవించడానికి కాదు, సేవ చేయడానికని బాబు పదేపదే గుర్తుచేస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని మూడోసారి పిలిచి మాట్లాడే ప్రసక్తే లేదని, నేరుగా వేటు వేస్తానని ఆయన హెచ్చరించారు. మరి నేతల వ్యవహారశైలి ఇప్పటికైనా మారుతుందా, లేదంటే ఇలాగే ఉంటారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతిలో అమరజీవికి అద్బుత...

తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

7 ఏళ్ళ ఒంటరి...

వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు...

సిట్ ముందుకు అనంత్...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన...

ఫామ్‌హౌస్ ‘రచ్చ’ వెనుక.....

మోయీనాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ...

బీఆర్ఎస్ కు గంపెడు...

తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల...

ముఖం చాటేసిన మంత్రులు..!

ఏపీలో కొందరు మంత్రుల తీరు ఇప్పుడు...

పోల్స్