Friday, September 12, 2025 01:02 PM
Friday, September 12, 2025 01:02 PM
roots

గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా సింగపూర్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముందు నుంచి ఆ దేశాన్ని అమితంగా అభిమానించే చంద్రబాబుపై ఎన్నో విమర్శలు ఉన్నా సరే.. అప్పుడు, ఇప్పుడు ఆ దేశ అభివృద్దిని కొనియాడుతూనే ఉంటారు చంద్రబాబు. తాజాగా మరోసారి ఆయన ఆ దేశ పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సింగపూర్ చట్టాల గురించి చెపుతూ 30 ఏళ్ల క్రితం నాటి జరిగిన కొన్ని సరదా సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read : మోడీకి అంత సీన్ లేదు.. ఓన్లీ షో

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు ప్రజలతో సమావేశం అయ్యారు. అక్కడ మాట్లాడుతూ సింగపూర్ చట్టాలు, పాలకుల యొక్క పట్టుదల, గొప్పదనం గురించి వివరించారు. తాను రెండో సారి సిఎం అయినప్పటి నుంచి సింగపూర్ వస్తున్నానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సింగపూర్ చట్టాలు, పాలకుల ఆలోచనలు తనను ఎంతగానో ఆకట్టుకునేవన్న ఆయన.. ఆ పాలసీలను, కఠిన చట్టాలను చూసి వాటిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసే ప్రయత్నాలు చేసినట్లు ఆయన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Also Read : చంద్రబాబు హామీ నెరవేరుతుందా..?

సింగపూర్ ఎంత గొప్పదంటే.. ఎప్పుడూ సిగిరెట్ తాగే అశోక్ గజపతి రాజు లాంటి వారు కూడా ఇక్కడ చట్టాలకు భయపడి నాడు సింగపూర్ వచ్చినప్పుడు సిగరెట్ వెలిగించలేదన్నారు. రెండో సారి సిఎంగా ఉన్న సమయంలో తాను మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి సింగపూర్ వచ్చానని.. ఎప్పుడూ సిగరెట్ వద్దన్నా వినని ఆశోక్ గజపతి రాజు.. అప్పుడు సింగపూర్ లో మాత్రం ఎక్కడా సిగరెట్ ముట్టుకోలేదన్నారు. సింగపూర్ లో చట్టాలు కఠినంగా ఉంటాయన్నారు. ఒక్కడ బహిరంగంగా సిగరెట్ తాగితే 500 డాలర్లు ఫైన్ వేస్తారని… నేను తెచ్చుకుందే 500 డాలర్లు, ఒక్క సిగరెట్ కు అంత సొమ్ము పెడితే మిగిలిన రోజుల్లో ఖర్చులకు డబ్బులు ఎలా అని ఆశోక్ గజపతి రాజు సింగపూర్ లో ఉన్నన్ని రోజులు సిగరెట్ తాగలేదని చంద్రబాబు ప్రస్తావించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్