వయసు 75 దాటింది… రాజకీయ అనుభవం 50 ఏళ్లు… పార్టీ అధ్యక్షునిగా 30 ఏళ్లు… నాలుగు సార్లు ముఖ్యమంత్రి… 15 ఏళ్ల పాటు సీఎం పదవి చేసిన రికార్డు… ఇది చంద్రబాబు ట్రాక్ రికార్డు.. వాస్తవానికి ఆరు పదుల వయసు దాటిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగ్గిపోతున్నారు. ఇక ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారం దృష్ట్యా మనిషి సగటు ఆయుర్థాయం 60 దాటడం లేదు. ఫిట్‌నెస్ ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే వాళ్లు కూడా ఈ మధ్య కాలంలో ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. అయితే ఇవేవీ చంద్రబాబు దరిదాపులకు కూడా రావేమో. కొన్ని విషయాలు గమనిస్తే… రావేమో కాదు… రావు కూడా అనేది అక్షర సత్యం.
Also Read : ఏపిలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు
చంద్రబాబు సమకాలిక రాజకీయ నేతలు, మిత్రులు, సన్నిహితులు, క్లాస్ మేట్స్‌లో చాలా మంది ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే కాలం చేశారు కూడా. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు. వృద్ధాప్య ఛాయలు కాదు కదా… కనీసం ఆ గాలి కూడా ఆయన దరిదాపులకు వచ్చేందుకు భయపడుతోంది. విజనరీ అనే పేరున్న చంద్రబాబు.. తన 95వ ఏట ఏపీ ఎలా ఉండాలో ఇప్పుడే డిసైడ్ చేశారు. విజన్ 2047ను రూపొందించారు కూడా. ఇక చంద్రబాబు స్పీచ్ అంటే చాలు.. కనీసం గంట అనే మాట సర్వసాధారణం. యంగ్ అండ్ ఎనర్జిటిక్ అని చెప్పుకునే యువ నేతలు కూడా గట్టిగా అరగంట పాటు నిలబడి మాట్లాడేందుకు నానా పాట్లు పడతారు. కానీ చంద్రబాబు అలా కాదు… తక్కువలో తక్కువ గంట పాటు అలా నిలబడి మాట్లాడగలరు. ఇక పార్టీ కార్యకర్తలతో సమావేశాల్లో అయితే ఒక్కోసారి 2 గంటలు కూడా దాటిపోతుంది. ఇదే విషయంపై గతంలోనే వైసీపీ నేతలకు చంద్రబాబు స్వయంగా సవాల్ కూడా చేశారు. నాకు వయసైపోయిందన్నారు కదా… రెడీ… గంట మాట్లాడుతా… కావాలంటే ఇంకో గంట కూడా నిలబడి మాట్లాడగలను.. మీ నాయకుడు నాలా తిరగగలడా అని చంద్రబాబు చేసిన ఛాలెంజ్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల సమయంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా 75 ఏళ్ల వయసులో ఆయన పడిన కష్టం.. పార్టీ నేతలనే కాదు.. విపక్ష నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

దావోస్ అంటే చాలు… మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత. పైగా జనవరి నెల కావడంతో విపరీతమైన మంచు. కాలు బయటపెట్టేందుకు కూడా భయపడే పరిస్థితి. ఎవరైనా సరే స్వెట్టర్ లేకుండా తిరగాలంటే బాబోయ్ అనేస్తారు. ఈ చలికి ఎవరూ అటు వైపు పోరు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీ బృందానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణ సీఎం మొదలు మంత్రులు, అతిథులంతా స్వెట్టర్ లేకుండా కనిపించటం లేదు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పుడు మాదిరిగానే అదే పొందూరు ఖద్దర్ చొక్కా… ఖద్దర్ ప్యాంట్, షూస్ వేసుకున్నారు తప్ప… కనీసం స్వెట్టర్ కూడా వేసుకోలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Also Read : ఇంకా చాలు.. టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్…!
75 ఏళ్ల వయసులో ఇంత చలి తట్టుకునేంత ఆరోగ్యం ఆయనకు ఎలా వచ్చింది.. అసలు ఆయనకు చలి వేయదా… చంద్రబాబు ఆరోగ్య రహస్యం ఏమిటీ… హిమాలయాల్లో బుుషులు, సాధువులు ఇలా లోక కల్యాణం కోసం తపస్సు చేసేవారంట.. అలాగే చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధి కోసం ఇలా ప్రయత్నం చేస్తున్నారా అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. మైనస్ డిగ్రీల చలి తట్టుకోవడానికి అంతా నైలాన్ జాకెట్లు వేసుకుంటే.. చంద్రబాబు మాత్రమే జస్ట్ ఖద్దర్ చొక్కాతో ఎలా తిరిగేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.