Friday, September 12, 2025 09:31 PM
Friday, September 12, 2025 09:31 PM
roots

ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి బాబు గ్రీన్ సిగ్నల్.. జగన్ కోసమేనా?

ఏపీలో సిబిఐ ఎంట్రీ కి టిడిపి ప్రభుత్వం మార్గం సుమగం చేసింది .ఈ మేరకు సిబిఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు వంటి వాటిపై ఏవైనా ఫిర్యాదులు వస్తే సిబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సిబీఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతులు విధించింది.

వాస్తవంగా 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణకు నిరాకరిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో నుంచి టిడిపి బయటకి వచ్చాక, టిడిపి నేతల పై అనేక కేసులు పెట్టి ఎన్నికల సమయంలో బిజెపి ప్రభుత్వం వేధిస్తుందన్న కారణంతో చంద్రబాబు నాడు రాష్ట్రంలోకి సిబిఐ రాకని నిరోధించారు.

అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఏపీలో అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి గెజిట్ ను ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేయడం రాజకీయంగా చర్చినియాంశంగా మారింది. జగన్ తో పాటు వైసిపి నేతలు కోసమే ఈ గెజిట్ ను విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి కీలక నేతలే టార్గెట్ గా అనేక విచారణలు చేపట్టడం, అరెస్టులు చేయించడం వంటివి జరిగాయి.

అయితే కొన్ని ముఖ్యమైన కేసులను సిబిఐ కి అప్పగించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం సిపిఐ ఎంట్రీ కి అనుమతిస్తూ గెజిట్ ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సిబిఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, న్యాయస్థానాలకు హాజరైయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో చేసిన తప్పులను ప్రభుత్వం ఎత్తి చూపిస్తూ ఉండడమే కాకుండా, సిబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని రకాలుగాను జగన్ తో పాటు వైసిపి నేతలను ఇరుకున పెట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా అర్థమవుతుంది. కారణం ఏదైనా ప్రస్తుత చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్