రాష్ట్రంలో 108(అత్యవసర వైద్యం), 104(సంచార వైద్యం) సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే అవకాశాలు… ఈ రెండు సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందంటూ ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్వహణ దారుణంగా ఉందని నిఘా సంస్థలూ ప్రభుత్వానికి నివేదక అందించిన నేపధ్యంలో 108, 104 సర్వీసుల బాధ్యత నుంచి అరబిందోను తప్పించడమే మేలని సర్కారు ఆలోచనలో పడింది. బాధ్యతల నుంచి తమకు తాముగా తప్పుకోవాలని లేదంటే తనకు ఉన్న అధికారాల్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : బొత్సలో ఎందుకీ వైరాగ్యం..?
వేరే సంస్థకు నిర్వహణను అప్పగించడంలో భాగంగా టెండరు పిలిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం అయింది. అరబిందో వ్యవహారంపై నిన్న ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించిన అనంతరం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన ఈ రెండు సర్వీసుల వర్క్ ఆర్డర్లను వైకాపా ప్రభుత్వం 2020లో జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఏడేళ్ల కాల పరిమితితో ఆ ఏడాది జులై 1న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2027 వరకు గడువు ఉండగా… టెండర్లలో అరబిందో గ్రూపు మాత్రమే ఎంపికయ్యేలా వైకాపా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అరబిందో గ్రూపు సంస్థల్లో వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి అల్లుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read : పాపం కేటీఆర్… ఇలా ఇరుక్కుపోయారే..!
ఈ కారణంగానే నాటి వైకాపా ప్రభుత్వం అరబిందోకు పూర్తి సహాయ సహకారాలు అందించింది. రాష్ట్రంలో 108 సర్వీసుల కింద అంతకుముందు ఉన్నవి… కొత్తగా కొనుగోలు చేసిన వాటితో కలిపి 768 అంబులెన్సులు నడుస్తున్నాయి. 104 సంచార వైద్యం కింద కొన్ని వాహనాలను గత పాలనలో కొనుగోలు చేసారు. 2019-24 మధ్యకాలంలో ఈ రెండు సర్వీసుల కింద రూ.450 కోట్లతో కొత్త వాహనాలు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ నివేదిక ఇచ్చారు. కొన్నిచోట్ల గోల్డెన్ అవర్లో బాధితులకు 108 అంబులెన్సుల ద్వారా సేవలు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిర్ణీత సమయానికి క్షతగాత్రుల వద్దకు అంబులెన్సులు వెళ్లలేదని కాగ్ నివేదిక సమర్పించింది.




