సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుంటారు. పరిపాలన పరంగా రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చిన సరే వాటి నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఏ సమయంలో అయినా సరే సిద్ధంగానే ఉంటారు. అయితే ఆయనకు ఎదురయ్యే కొన్ని పరీక్షలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రికి ఎదురుకాని సమస్యలను చంద్రబాబు సర్కార్ ఎదుర్కొంటూ ఉంటుంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు కాస్త దూకుడుగానే పరిపాలన చేస్తూ ఉంటారు.
Also Read : బలగాలకు పూర్తి స్వేచ్చ, ప్రధాని కీలక ప్రకటన
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం బాగా ఇబ్బంది పడింది. ఒకవైపు రాజధాని లేకపోవడం.. మరోవైపు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడం వంటివి చంద్రబాబు ముందున్న సవాళ్లు. ఈ సమయంలో హూద్ హూద్ తుఫాన్ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తుఫాన్ నుంచి చంద్రబాబు నాయుడు బయటపడ్డారు. విశాఖను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటన చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దీనిపై అప్పట్లో వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read : రాహుల్ సెలెబ్రేషన్ గూస్ బంప్స్.. మామ సునీల్ శెట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఇక 2024లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. విజయవాడ వరదలు సవాల్ చేశాయి. ఆ వరదల నుంచి బయటకు వచ్చే సమయానికి రాజధాని పనులు ఎక్కడికి అక్కడ ఆగిపోవడం.. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టడంతో చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుపతిలో ప్రాణాలు కోల్పోవడం చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఆ ఘటనలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Also Read : బలగాలకు పూర్తి స్వేచ్చ, ప్రధాని కీలక ప్రకటన
ఇక ఇప్పుడు సింహాచలం ఘటన మరోసారి సంచలనంగా మారింది. ఇలా వరుస ఘటనలు, ప్రభుత్వ ఇబ్బందులు, చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇక సింహాచలం ఘటనపై వైసీపీ సోషల్ మీడియా.. చంద్రబాబును ఐరన్ లెగ్ అంటూ కామెంట్ చేయడం మొదలు పెట్టింది. ఏది ఎలా ఉన్నా ఏ ముఖ్యమంత్రి కి ఎదురుకాని సమస్యలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నారు.




