Tuesday, October 28, 2025 07:28 AM
Tuesday, October 28, 2025 07:28 AM
roots

ఎన్నారైలకు చంద్రబాబు పిలుపు..!

రాష్ట్రాభివృద్ది పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. అమరావతి పనులను వేగం పెంచడంతో పాటుగా సాగు నీటి ప్రాజెక్ట్ లను కూడా వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక తాజాగా చంద్రబాబు.. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మాట్లాడారు సిఎం. ముందు.. వేసవిలో అమలు చేయబోయే విధానాలపై పలు సూచనలు ఇచ్చారు చంద్రబాబు.

Also Read: సుశాంత్ మరణం మిస్టరీనే…?

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదన్నారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని.. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలి… తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.

Also Read: చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!

అడవుల్లో అగ్నిప్రమాదాల పై అప్రమత్తంగా ఉండాలని… డ్రోన్లతో పర్యవేక్షించాలని అందించారు. ఇక పీ 4(పబ్లిక్‌- ప్రైవేట్‌- పీపుల్స్‌- పార్టనర్‌షిప్‌) విధానంపై సిఎం మాట్లాడారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు చంద్రబాబు. సంపన్నులు – పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యమన్న ఆయన.. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని పిలుపునిచ్చారు. అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ అన్నారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని.. 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పమన్నారు. ఉగాది రోజున అమరావతిలో పీ4 ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్