కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. తొలి అడుగు పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో గడప గడపకు తిరుగుతున్నారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య అటు పార్టీని, ఇటు నేతలను తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందా.. ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు.. నిజంగా ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందుతున్నాయా.. ఇసుక నిజంగానే ఉచితంగా అందుబాటులో ఉందా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రెండు రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారనే మాట పెద్ద దుమారం రేపుతోంది.
Also Read : ఎవరి మీద నమ్మకం లేదంటున్న వైసీపీ..!
వాస్తవానికి చంద్రబాబు అంటే.. పార్టీ నేతలకు మార్కులు వేస్తారనే భయం. ప్రతి విషయంలో కార్యకర్త నుంచి అధినేత వరకు ప్రతి ఒక్కరి గురించి ఆయన దగ్గర డేటా ఉంటుంది. ఇందుకోసం ఆయన రకరకాల మార్గాల్లో రిపోర్టు సేకరిస్తారు. ఇది ఐవీఆర్ఎస్ ద్వారా, లేదంటే ఇంటెలిజెన్స్ ద్వారా, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా.. పలు మార్గాల్లో నేతల గురించి సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఆ నేతకు కూడా తెలియని కొన్ని విషయాలు సేకరించి.. వాటిపై వార్నింగ్ కూడా ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తరఫున ప్రచారం చేయడంలో ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారనేది చంద్రబాబు ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షం చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారనేది కూడా చంద్రబాబు మాట. ఈ విషయాలపై పదే పదే పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అయినా సరే.. కొందరు నేతలు మాత్రం చంద్రబాబు మాటలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదే విషయంపై ఇప్పుడు చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్
ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహిస్తానని.. వారి ప్రొగ్రెస్ కార్డు వారికే చూపిస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి రోజుకు కొంతమంది నేతలో వన్ టూ వన్ నిర్వహిస్తున్నారు. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలతో మొదలుపెట్టిన ఈ భేటీలు.. ప్రతి రోజు ఇద్దరు, ముగ్గురితో సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రహస్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాపారాలపై కూడా చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఇవే అంశాలను ఎమ్మెల్యే వన్ టూ వన్‌లో ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఇసుక, మద్యం, మైనింగ్ లావాదేవీల్లో వేలు పెడుతున్న వారికి చంద్రబాబు క్లాస్ పీకుతున్నారు. కొందరికి సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మరోసారి ఇదే తరహా ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా.
వాస్తవానికి సరిగ్గా ఆరు నెలల క్రితమే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అప్పుడే ప్రతి ఒక్కరి గురించి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై మంత్రులు సహా ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మార్కాపురంలో నియోజకవర్గ రివ్యూ సమావేశంలోనే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి సైలెంట్‌గా చురకలు అంటించారు. సభ్యత్వ నమోదు సహా.. చాలా విషయాల్లో వెనుకబడుపోయావన్నారు. అదే మాట ఇటీవల జరిగిన వన్ టూ వన్ భేటీలో ప్రస్తావించారు.
Also Read : 2 వారాలుగా జగన్ ఫుల్ బిజీ.. ఏం జరుగుతోంది..?
కొందరు నేతలు నియోజకవర్గంలో పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. అది సరి కాదన్నారు. కూటమి పార్టీలతో సఖ్యత ముఖ్యమని చంద్రబాబు పదే పదే సూచించారు. జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకోవాలని.. లేదంటే రాబోయే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని.. ఈ లోపు నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. లేదంటే.. రాబోయే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇస్తానని వార్నింగ్ కూడా చంద్రబాబు. మరి నేతలు ఇప్పుడు తమ తీరు మార్చుకుంటారా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.