Tuesday, October 28, 2025 04:26 AM
Tuesday, October 28, 2025 04:26 AM
roots

దుబాయ్ ను చూస్తే అసూయ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్ర సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అవకాశం ఉన్న వేదికలపై సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్న నేపధ్యంలో.. పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు.

Also Read : అప్పుడు బ్రతుకు మీద ఆశ కోల్పోయాను.. అమీర్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్.. సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.. యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులేనన్నారు చంద్రబాబు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసారు.

Also Read : అవును అక్రమాలు చేసాం.. అంగీకరించిన అనిల్ యాదవ్ అనుచరుడు

1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారిందన్నారు. సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు రావడం చర్చలకు ప్రాధాన్యత చేకూర్చిందని తెలిపారు. దుబాయ్ ను చూస్తుంటే నాకు ఆసూయ వేస్తుంటుంది.. దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌కు అపార అవకాశాలు వచ్చాయి..ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించానని తెలిపారు. విజన్ 2020తో రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచాం.. వికసిత్ భారత్ ద్వారా 2047 ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామన్న చంద్రబాబు.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్