Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

గుంటూరు, విజయవాడ నగరాలకు బాబు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కీలక నగరాల మీద చంద్రబాబు సర్కార్ గట్టిగానే గురి పెట్టి అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఏపీలో జంట నగరాలు నిర్మించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విజయవాడతో పాటు గుంటూరు పై దృష్టి పెడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు, 8 మండలాలు ఉన్నాయి. రూరల్ మండలాన్ని రద్దు చేయనున్నారు. దీనికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు – విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ:2 వేల కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు దీటుగా వీటిని అభివృద్ధి చేస్తారు. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా మార్చనున్నారు. గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు చూస్తే… మేడికొండూరు: పేరేచర్ల, డోకిపర్రు.. ఫిరంగిపురం: అమీనాబాద్.. చేబ్రోలు: నారాకోడూరు, గొడవర్రు, గుండవరం.. ప్రత్తిపాడు: చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం.. తాడికొండ: లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు..వట్టిచెరుకూరు: పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల కలుస్తాయి.

అలాగే పెద్దకాకాని: రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకట కృష్ణాపురం.. గుంటూరు: చిన్న పలకలూరు, మల్లవరం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు నాయుడుపాలెం కలుస్తాయి. గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న నేపధ్యంలో ఈ ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరు గా రూపాంతరం చెందుతుంది. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం కానున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా రద్దు అవుతుంది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలిపేస్తారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్