Friday, September 12, 2025 07:09 PM
Friday, September 12, 2025 07:09 PM
roots

మహిళలకు చంద్రబాబు కానుక..!

ఏపీలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీ నెరవేరుస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్‌లను పెంచారు. అలాగే మెగా డీఎస్సీ ప్రకటించారు. దీపం-2 పథకం కింద మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా అందిస్తున్నారు కూడా. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా కూటమి సర్కార అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్ద పీట వేసేందుకు నిర్ణయం తీసుకుంటోంది.

Also Read :రేవంత్ బీజేపీలోకి వచ్చెయ్.. ఎంపీ సంచలన కామెంట్స్

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు కీలక నిర్ణయాల అమలుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. వీటికి ఇప్పటికే వార్షిక బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు జమ చేసేందుకు నిధులు కూడా కేటాయించారు. ఈ పథకాన్ని మే నెలలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటించారు కూడా. దీంతో ఈ విషయంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు… లోకేష్ ప్రకటనతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మహిళలకు మరో శుభవార్త చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రతి ఏడాది కానుకను చంద్రబాబు సర్కార్‌ అందిస్తుంది.

Also Read : రజనీ కేసులపై ఏసీబీ కీలక నిర్ణయం…!

అలాగే మహిళ కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. మహిళా దినోత్సవరం వేళ అమలు చేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఏపీలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 1,02,832 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేయనుంది. ఇందుకోసం రూ.255 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. బీసీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా సామాజిక వర్గానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.

Also Read: రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక దాదాపు పూర్తి చేశారు కూడా. అలాగే మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళలకు కొత్త రుణాలపైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి డ్వాక్రా మహిళలకు నామ మాత్రపు వడ్డీతో రూ.లక్ష వరకు రుణం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ఈ మొత్తాన్ని మహిళలు ప్రత్యేక సందర్భాల్లో వినియోగించుకునే వెసులుబాటు కూడా కూటమి ప్రభుత్వం కల్పించనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్