రాజకీయాల్లో సాంప్రదాయ ప్రసంగాలకు కాలం చెల్లింది. అభిమానులు, కార్యకర్తలు కూడా పద్దతిగా మాట్లాడటం కంటే మాస్ ప్రసంగాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మాటలతో తన్నాలి, గుద్ధాలి, చంపాలి… ఇప్పుడు ఇదే రాజకీయాల్లో ట్రెండ్. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు మాటల యుద్దాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. వినోదానికి అలవాటు పడిన సామాన్య ప్రజలు కూడా రాజకీయ నాయకులు తిట్టుకుంటేనే వినడానికి ఇష్టపడుతున్నారు. దీనితో రాజకీయ నాయకులు సైతం ఆ ట్రెండ్ కి అలవాటు పడి సాంప్రదాయ రాజకీయం అనే మాట మర్చిపోయారు.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చండాలం ఎక్కువగా ఉంది. అందుకే పద్దతిగా మాట్లాడే టీడీపీ నేతలు కూడా తమ మాట తీరు మార్చారు. గత 5 ఏళ్ళుగా టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు చాలానే నేర్చుకున్నారు. అందుకే ఆయన మాట తీరులో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అదే ట్రెండ్ చంద్రబాబు కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. పాపం జరిగింది, దాన్ని కడగాలంటే వైసీపీ దారిలోనే వెళ్ళాలి అనుకున్నారు, అదే ఫాలో అయ్యారు.
ఆధారాలు లేకుండా చంద్రబాబు అలాంటి విమర్శలు చేయరు అనే అవగాహన చాలా మందికి ఉంది. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ తప్పించి పెద్దగా ఎవరూ రియాక్ట్ కావడం లేదు. వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి… ఇలా రెడ్డి గార్లే విమర్శలకు దిగారు. వాళ్లకు కౌంటర్ ఇవ్వాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని భావించారు. చంద్రబాబు సహా ఇతర కీలక నేతలు ఎవరూ ఈ వ్యవహారంలో మాట్లాడకుండా జనాల్లోకి వెళ్ళే విధంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ భుజాలపై ఈ వ్యవహారం ఉంచారు.
రాజకీయ నాయకుల నుంచి సినిమా వాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ కౌంటర్ లు ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు మాట్లాడితే పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు వైరల్ చేయరు… పవన్ మాట్లాడితే టీడీపీ వాళ్ళు కూడా వైరల్ చేస్తారు అనుకున్నారో ఏమో గాని పవన్ తోనే ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్ వర్క్ కి దిగారు. సైలెంట్ గా డీజీపీ తో భేటీ అయి, సిట్ పై ఒక నిర్ణయానికి వచ్చి ఏర్పాటు చేసారు. ఇక పవన్ కళ్యాణ్ వైసీపీకి గ్యాప్ ఇవ్వకుండా కొట్టడం మొదలుపెట్టారు.
Read Also : మందు బాబులకు బాబు సర్కార్ గుడ్ న్యూస్
ఈ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది అనే చెప్పాలి. ముందు జగన్ మాట్లాడారు, తర్వాత సైలెంట్ అయ్యారు, తర్వాత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు, విజిలెన్స్ విచారణ దెబ్బకు సైలెంట్ అయ్యారు. హైకోర్ట్ లో విచారణ వద్దని పిటీషన్ దాఖలు చేసారు, సోమవారం తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి హడావుడి చేసారు, మంగళవారం వారి జాడ లేదు. ఇక పవన్ ప్రసంగంతో సినిమా వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు అనే చెప్పాలి. వైసీపీ ఈ విషయంలో ఎంత సేఫ్ గేమ్ ఆడాలని చూసినా ఆడలేకపోతుంది.
గతంలో చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి టీడీపీ సోషల్ మీడియా కృషి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది, వ్యూహం మారింది. చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తుంటే పవన్ నుంచి కౌంటర్ లు వస్తున్నాయి. విజయవాడ వరదల్లో కూడా అదే జరిగింది. వైసీపీ విమర్శలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు లడ్డూ వ్యవహారంలో కూడా పవన్ చేస్తున్నదే మీడియాలో హైలెట్ అవుతోంది. మరి వీటిపై వైసీపీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.