Saturday, September 13, 2025 03:00 AM
Saturday, September 13, 2025 03:00 AM
roots

తప్పంతా మీదే.. అధికారులపై బాబు ఫైర్…!

తిరుమలలో బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులతో దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీటీడీ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లపై చంద్రబాబు ఆసహనం వ్యక్తం చేసారు. టీటీడీ ఉన్నతాధికారులపై కూడా చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Also Read  :కార్యకర్తలతో జగనన్న.. మళ్లీ వాయిదా..!

శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరమన్న ఆయన ప్రమాద ఘటనకు కారకులపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేస్తున్నామని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట లో మృతి చెందిన 6 గురిని గుర్తించామని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు చంద్రబాబు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీరియస్ గా ఉన్న ఇరువురికి 5 లక్షల నగదు పాటు కోల్కొనేంతవరకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

Also Read  :ఎమ్మెల్యేలు జారిపోతారా..? కాచుకు కూర్చున్న బిజెపి…!

గాయాల పాలైన 32 మందికి రెండు లక్షల తక్షణ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ని సస్పెండ్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ ను బదిలీ బదిలీ చేస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అటు తిరుమలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. అధికారుల తీరుపై పవన్ మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్