ఐఏఎస్ అధికారుల సర్వీసులో అవినీతి మచ్చ పడని అధికారులలో కొందరు సర్వీస్ నుండి రిటైర్డు కాగా, ఇంకా చాలామంది సర్వీసులో కొనసాగుతున్నారు. ఎంత మంది ఉన్నారనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఒక రిటైర్డు సీనియర్ దళిత ఐఏఎస్ అధికారి సర్వీసు నుండి రిటైర్డు అయినా సరే.. మళ్ళీ ఆయన సర్వీసు మరో ఏడాది పొడిగించారు సీఎం చంద్రబాబు. ఆ పొడిగింపు సర్వీసు కూడా పూర్తి కావటంతో తాజాగా మరో ఏడాది మళ్లీ పొడిగించారు. అసలు ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపు వెనుక ఏ కారణాలున్నాయనే విషయం ఇప్పుడు ఐఏఎస్ సర్కిల్లో, సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్.
అసలు విషయానికొస్తే.. ఆయన సమర్ధుడు, నిజాయితీ పరుడైనా రిటైర్డు దళిత ఐఏఎస్ అధికారి.. 30 ఏళ్లు పైగా సర్వీసులో ఉన్నా కూడా ఒక్క అవినీతి మచ్చ పడలేదు. అందుకేనేమో ఆ దళిత సీనియర్ ఐఏఎస్ అధికారి నిజాలు మాట్లాడినందుకే, నాలుగు నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా గాలిలో పెట్టారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు సీఎం అయ్యాక.. వెంటనే ఎంతో ప్రాధాన్యత ఉన్న శాఖాధిపతిగా నియమించారు. ఇక ఆ అధికారి రిటైర్డు అయ్యే నాటికి.. ఏడెనిమిది శాఖలను నిర్వహించారు కూడా. ఆయన నిజాయితీని, సమర్థతను పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు.. ఆ అధికారి సర్వీస్ తొలుత ఏడాది.. తర్వాత మరో ఏడాది పొడిగించారు.
Also Read : బంగ్లా క్రికెట్ బోర్డు సముద్రం మీద అలుగుతోందా..?
నిజానికి మొదటిసారి సర్వీస్ పొడిగించినప్పుడే టీడీపీ నేతల్లో, అనుకూల మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. అయినా అవేవీ ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు.. వాటిని అస్సలు ఖాతరు చేయలేదు. తొలిసారి పొడిగించినప్పుడు అధికారి సమర్థతను దగ్గరగా గమనించిన చంద్రబాబు సంతృప్తితో మరో ఏడాది పొడిగించారు. నిజానికి ఇక్కడ కులం చూడలేదు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారి కాదు. ఇంకా చెప్పాలంటే.. దళిత అధికారి సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి మద్దతిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా సరే.. అవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ అధికారి సమర్థతను, నిజాయితీని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి పేరు, బి.రాజశేఖర్. ఆయన ఎవ్వరికీ హానికరం కాదు.. ఎవ్వరికీ అన్యాయం జరగదు అని భావించిన సీఎం చంద్రబాబు.. అన్నీ ఆలోచించి, రాజశేఖర్ సర్వీసు రెండోసారి కూడా పొడిగించారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు చెబుతున్న మరో కారణం.. ప్రస్తుతం ఏపీలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని.. అందుకే పొడిగించినట్లు చెప్పుకొచ్చారు. నిజానికి సర్వీసు పొడిగింపు ముందు రాజశేఖర్‌తో చంద్రబాబు స్వయంగా భేటీ అయ్యారు. నా స్పీడు అందుకోగలరా అని రాజశేఖర్‌ను సూటిగా ప్రశ్నించారంట. తనకు ఓ ప్రైవేట్ కంపెనీ ఏడాదికి కోటి రూపాయలు జీతం ఆఫర్ చేసిందని.. కానీ తనకు ఇష్టం లేదని.. రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు, రైతులకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు చెప్పారంట.
Also Read : త్వరలో భారత్ కు ట్రంప్ మరో షాక్..!
ఏడాదికి కోటి రూపాయలు జీతం వదులుకున్న రాజశేఖర్‌ను అభినందించిన చంద్రబాబు సర్వీసును కొనసాగించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. గతంలో సీఎస్ పోస్టులో ఉన్న దళిత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు సర్వీసు కూడా అప్పట్లో చంద్రబాబు పొడిగించారు. మరోసారి కూడా రాజశేఖర్ సర్వీస్ ఏకంగా రెండేళ్లు పొడిగించారు. సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక కూడా, రెండేళ్లు సర్వీస్ పొడిగింపు పొందిన ఏకైక దళిత సీనియర్ ఐఏఎస్ అధికారి, సచివాలయం చరిత్రలో రాజశేఖర్ ఒక్కరే.. అదికూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతోనే.

